సనాతన భారతీయ సాంప్రదాయంలో కట్టు బాట్లకు, ఆచారాలకు, వస్త్రాలంకరణకు గొప్ప ప్రాముఖ్యత ఉంది. అలాంటి ఆచార, సంప్రాదాయాలు నేటి ఆధునిక యుగంలో మారుతూ వస్తున్నాయి. ఇదే క్రమంలో వస్త్రాలంకరణలు కూడా ఆధునిక కాలానికి తగ్గట్లుగానే చేంజ్ అవుతూ వస్తున్నాయి. ప్రస్తుత సమాజంలో ఆడవారి డ్రస్సింగ్ పై అనేక విమర్శలు ఎవరో ఒకరు చేస్తూనే ఉన్నారు. తాజాగా మరోసారి మహిళల వస్త్రాధారణపై విమర్శలు వెలుగులోకి వచ్చాయి. తమిళ ఇండస్ట్రీకి చెందిన నటుడు సతీష్.. సన్నీలియోన్, దర్శగుప్తాల డ్రస్సింగ్ ను పోలుస్తూ అభ్యంతరకర వ్యాఖ్యలు చేశాడు. ప్రస్తుతం ఈ వ్యాఖ్యలు నెట్టింట వైరల్ గా మారాయి. దాంతో ఈ వ్యాఖ్యలపై తాజాగా ట్వీటర్ ద్వారా స్పందించింది సింగర్ చిన్మయి శ్రీపాద. మీలాంటి మగాళ్ల బుద్ధి ఇకనైనా మారాదా అంటూ ఘాటు వ్యాఖ్యలు చేసింది.
సన్నీలియోన్, దర్శగుప్తా లీడ్ రోల్ లో నటిస్తున్న చిత్రం ‘ఓ మై ఘోస్ట్’. ఈ చిత్రానికి అభిషేక్ కపూర్ దర్శకత్వం వహించాడు. త్వరలో రిలీజ్ కు సిద్దంగా ఉన్న ఈ సినిమా.. ప్రీ రిలీజ్ వేడుకను తాజాగా చెన్నైలో నిర్వహించారు. ఇక ఈ సినిమాలో ఓ చిన్న పాత్ర చేశాడు తమిళ నటుడు సతీష్. ఈ వేడుకలో సతీష్ మాట్లాడుతూ..”ఎక్కడో ముంబాయి నుంచి తమిళనాడుకు వచ్చిన సన్నీలియోన్ ఈ వేడుకకు చక్కగా చీర కట్టుకొని వచ్చింది. చూడ్డాన్నికి చాలా అందంగా ఉంది. అటు చూడండి మన దగ్గర అమ్మాయి మాత్రం మోడ్రన్ డ్రస్ వేసుకుని వచ్చింది. నేనేమీ విమర్శించట్లేదు.. జస్ట్ పాయింట్ అవుట్ చేస్తున్నాను అంతే” అని నవ్వుతూ అన్నాడు. దాంతో ఒక్కసారిగా అక్కడున్న వారంతా పగలబడి నవ్వారు. సతీష్ వ్యాఖ్యలు వైరల్ గా మారడంతో సోషల్ మీడియాలో అతడిపై విమర్శల వర్షం కురుస్తోంది.
I mean – To actually *point* at a woman and ask for mass heckling of a crowd by a man on a woman who doesn’t dress according to culture.
When will this behaviour from men stop?
Its not funny. pic.twitter.com/HIoC0LM8cM
— Chinmayi Sripaada (@Chinmayi) November 9, 2022
తాజాగా టాలీవుడ్ ప్రముఖ సింగర్ చిన్మయి శ్రీపాద ఈ వ్యవహారంపై స్పందించింది. మహిళల డ్రస్సింగ్ పై బహిరంగంగా కామెంట్స్ చేయడాన్ని ఆమె తప్పుపట్టింది. మీ మగాళ్లు మా దుస్తులపై కామెంట్స్ చేయడం ఆపరా? ఇంకెన్నాళ్లు మమ్మల్ని బానిసలుగా చూస్తారు అంటూ ఘాటుగా వ్యాఖ్యానించింది. తన ట్వీటర్ లో చిన్మయి ఈ విధంగా రాసుకొచ్చింది.”ఒక స్త్రీని లక్ష్యంగా చేసుకుని, ఆమె వేసుకున్న డ్రస్ పై విమర్శలు చేయడం ఏంటి? ఆ మాటలకు జనాలు పగలబడి నవ్వడం ఏంటి? ఇలా మహిళల డ్రస్ పై విమర్శలు చేసే ఇలాంటి మగాళ్ల ప్రవర్తన ఇంకెప్పుడు మారుతుందో? నవ్వడానికి ఇది సరదా మాటలు కాదు కదా” అంటూ చిన్మయి ఘాటుగా ట్వీట్ చేశారు.