Radhamonal Naval: కొంతమంది సినీ సెలెబ్రిటీల నటనా జీవితానికి, నిజ జీవితానికి ఎక్కడా పొంతన ఉండదు. సినిమాలో ధాన కర్ణుడిలా కనిపించే వారు.. బయట పిల్లికి కూడా బిచ్చం వేయనివారిలా ఉంటారు. సినిమాలో హీరోయిజంతో ఎన్ని కష్టాలనైనా ఎదురించి పోరాడేవాళ్లు.. నిజ జీవితంలో పిరికి వాళ్లలా కష్టాలకు భయపడిపోతుంటారు. అలా మనసుకు కష్టం వచ్చి ప్రాణాలు తీసుకున్న నటీనటులు చాలా మందే ఉన్నారు. మొన్న దివ్యభారతి, సిల్క్ స్మిత తరంనుంచి నేడు సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ వరకు అందరూ మానసికంగా ఓడిపోయి ప్రాణాలు తీసుకున్నవారే.
వారే కాదు.. వీరిలా చాలా మంది ప్రాణాలు తీసుకున్నారు. వీరందరి చావులకు చాలా వరకు ప్రధాన కారణం ప్రేమ వ్యవహారాలు కావటం విశేషం. అలా ప్రేమ వ్యవహారాల కారణంగా ప్రాణాలు తీసుకున్న వారిలో ప్రముఖ హీరోయిన్ సిమ్రాన్ చెల్లెలు మోనాల్ నావల్ ఒకరు. హీరోయిన్గా అప్పుడప్పుడే అవకాశాలు అందుకుంటున్న టైంలో ప్రేమ కారణంగా ఆత్మహత్య చేసుకున్నారు. అర్థాంతరంగా అందరినీ వదిలిపెట్టి వెళ్లిపోయారు.
స్వయం కృషితో సినిమాల్లోకి.. 18 ఏళ్లకే మొదటి సినిమా..
రాథామోనాల్ నావల్ అలియాస్ మోనాల్ నావల్ ప్రముఖ సినీ హీరోయిన్ సిమ్రాన్ ముగ్గురు చెల్లెల్లలో ఒకరు. అప్పటికే సిమ్రాన్ సౌత్‌లో టాప్ హీరోయిన్గా వెలుగొందుతోంది. అయినప్పటికి అక్క సపోర్టు లేకుండానే మోనాల్ సినిమాల్లోకి వచ్చారు. సినిమాల్లోకి రావటానికి ముందు మోడలింగ్, ష్యాషన్ షోలు చేశారు. మిస్ బాంబే కిరీటాన్ని గెలుచుకున్నారు. తద్వారా సినిమా ఆఫర్ వచ్చింది.
2000లో 18 ఏళ్ల వయసులో ‘ఇంద్ర ధనుష్’ అనే కన్నడ సినిమాలో అవకాశాన్ని దక్కించుకున్నారు. ఆ తర్వాత విజయ్ హీరోగా వచ్చిన ‘ బద్రి’ సినిమాలో హీరోయిన్గా చేశారు. తర్వాత వరుస ఆఫర్లు అందుకున్నారు. పార్వయ్ ఒండ్రే పోదుమే, లవ్లి, సుముదిరం సినిమాలు చేశారు. తెలుగులో ‘ఇష్టం’ అనే సినిమాలో స్పెషల్ సాంగ్‌లో నటించారు. హీందీలో ‘మా తుఘే సలామ్’ సినిమా చేశారు.
కొరియోగ్రాఫర్‌తో ప్రేమ.. అతడు కాదన్నందుకే ఆత్మహత్య?
మోనాల్ 2002 ఏప్రిల్ 14న చెన్నైలోని తన ఇంట్లోని గదిలో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నారు. మోనాల్ ఆత్మహత్యకు గల కారణాలు తెలియజేస్తూ ఎలాంటి సూసైడ్ నోటు దొరకలేదు. అయితే, తన చెల్లెలు చావుకు కారణం ప్రముఖ కొరియోగ్రాఫర్ ప్రసన్న సుజితేనని సిమ్రాన్ ఆరోపించారు. ప్రసన్న తన చెల్లెల్ని ప్రేమించి, పెళ్లి చేసుకోమంటే కుదరదన్నాడని అన్నారు. ప్రసన్న కాదన్నాడన్న బాధలో తన చెల్లెలు ఆత్మహత్య చేసుకుందని పేర్కొన్నారు. అయితే, ఆమె చావుకు ప్రసన్నే కారణమన్న రుజువులేవీ దొరకలేదు. మోనాల్ మరణానికి గల సరైన కారణం ఇప్పటికీ మిస్టరీగానే మిగిలింది.
ఇవి కూడా చదవండి : Pokiri Special Show: TVలో 100 సార్లు చూసినా.. పోకిరి స్పెషల్ షోలకి భారీక్రేజ్ ? నిమిషాల్లో టికెట్స్ మాయం!