సీనియర్ హీరోయిన్ శ్రియ.. ఈమెకు ఒక్క తెలుగులోనే కాకుండా దేశవ్యాప్తంగా అభిమానులు ఉన్నారు. ఇటివలే దృశ్యం 2 సినిమాతో బాలీవుడ్ ప్రేక్షకులను అలరించారు. తమిళంలో సూపర్ హిట్ అయిన దృశ్యం 2 సినిమాని హిందీలో రీమేక్ చేశారు. తెలుగులో అయితే ఇటీవలే ట్రిపులార్ సినిమాలో సరోజినిగా కనిపించి మెప్పించింది. అటు వైవాహిక జీవితాన్ని కూడా బాగా ఎంజాయ్ చేస్తోంది. తన కుమార్తె, భర్తతో ఎప్పుడూ వెకేషన్లు, బీచ్ ట్రిప్పులతో సరదాగా గడుపుతూ ఉంటుంది. అయితే ఇప్పటికే చాలాసార్లు భర్త ఆండ్రీ కోస్చివ్‌తో కలిసి షికార్లకు, ఫంక్షన్లకు అటెండ్ అయ్యింది. ఆ సందర్భంలో కెమెరాల ముందు శ్రియ తన భర్తకు పెదాలపై ముద్దు పెడుతూ ఫోజు ఇస్తుంది.
ఇటీవలే జరిగిన ఓ ఈవెంట్‌కి భర్త ఆండ్రీ కోస్చివ్‌తో కలిసి శ్రియ హాజరైంది. అక్కడ స్టేజ్‌పై కూడా భర్తకు పెదాలపై ముద్దు పెట్టింది. అయితే ఇప్పుడు ఆమె చేసిన పనిని సోషల్ మీడియాలో ట్రోల్ చేస్తున్నారు. అలాంటి ట్రోల్స్ చూసిన తర్వాత శ్రియ వాటిపై స్పందించింది. అసలు తనని ఎందుకు ట్రోల్ చేస్తున్నారో అర్థం కాలేదంది. “అది నాకు చాలా ప్రత్యేకమైన సందర్భం. అయినా కెమెరా ముందు ముద్దు పెట్టుకుంటే తప్పేముంది. ఆండ్రీ కూడా దానిని చాలా సర్వసాధారణంగానే భావిస్తున్నాడు. ఆ విషయానికి ఎందుకు ట్రోల్స్ చేస్తున్నారో అర్థం కావడం లేదు” అంటూ శ్రియ ట్రోల్స్ పై స్పందించింది.
శ్రియ సమాధానం, రెస్పాన్స్ విన్న తర్వాత కూడా ఆమెపై ట్రోల్స్ ఆగలేదు. ప్రతిసారి అలా ముద్దులు పెట్టుకోవాల్సిన అవసరం లేదు కదా అంటూ అభిప్రాయ పడుతున్నారు. అలా ఎలా మీరు బహిరంగంగా ముద్దులు పెడతారంటూ ప్రశ్నిస్తున్నారు. బయటకు వచ్చినప్పుడు పద్ధతిగా ఉండచ్చు కదా అంటూ పెదవి విరుస్తున్నారు. కెమెరాలు కనిపించగానే ముద్దులు పెట్టుకోవాల్సిన అవసరం లేదు కదా అంటూ హితవు పలుకుతున్నారు. గతంలో కూడా చాలాసార్లు ఇలాగే ప్రవర్తించారంటూ విమర్శిస్తున్నారు. ఇంక శ్రియ సినిమాల విషయానికి వస్తే.. మ్యూజిక్ స్కూల్ అని బహుభాషా చిత్రంలో నటిస్తోంది. కన్నడలో తెరకెక్కుతున్న ఉపేంద్ర కబ్జా సినిమాలో శ్రియ కీలకపాత్ర పోషిస్తోంది.