తెలుగు ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేక ఇమేజ్ సొంతం చేసుకున్న నటి శ్రియా సరన్. తక్కువ సమయంలోనే స్టార్ హీరోల సరసన ఛాన్స్ కొట్టేసి స్టార్ హీరోయిన్ గా దూసుకుపోయింది. అందం, అభినయంతో చిత్రపరిశ్రమలో స్టార్ హీరోల సరసన నటించి మెప్పించింది. కొన్ని ఐటమ్ సాంగ్స్ లో కూడా నటించింది.
శ్రియా సరన్, 2018 మార్చి 19న తన బాయ్ ఫ్రెండ్ అయిన రష్యాన్ కు చెందిన ఆండ్రీ కోషివ్ ను వివాహం చేసుకున్నారు. ప్రస్తుతం వీరికి రాధ అనే పాప ఉంది. శ్రియా తన భర్త, పాపతో కలిసి ఉన్న ఫోటోలను ఎప్పటికప్పుడు షేర్ చేస్తూ,తన వ్యక్తిగత విషయాలకు సంబంధించిన విషయాలను కూడా అభిమానులతో పంచుకుంటూ ఉంటుంది. ఈ క్రమంలోనే తాజాగా శ్రియా దంపతులు కూతురు రాధ కీ చెవులు కుట్టించారు. ఆ ఫోటోలలో శ్రియా తన కూతురిని ఒడిలో కూర్చోబెట్టుకోగా ఆమె పక్కనే తన భర్త కూడా ఉన్నాడు.
స్టార్ హీరోయిన్ గా చిత్రపరిశ్రమలో చక్రం తిప్పిన శ్రియా తనకు తగ్గ పాత్రల్లో నటిస్తూ మెప్పిస్తుంది. ఇటీవల ఆర్ఆర్ఆర్ సినిమాలో కీలకపాత్రలో నటించి మెప్పించింది. శ్రియా సరన్ కేవలం తెలుగులో మాత్రమే కాకుండా ఇతర భాషలలో కూడా నటించి తనకంటూ కొంత మంది అభిమానులను సంపాదించుకుంది. శ్రియా కూతురు రాధ కీ చెవులు కుట్టించింన ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడయాలో తెగ వైరల్ అవుతున్నాయి. ఈ ఫోటోలను చూసిన అభిమానులు పాప చాలా క్యూట్ గా ఉంది అంటూ కామెంట్స్ చేస్తున్నారు. ఈ విషయం పై మీ అభిప్రాయాలు కామెంట్స్ రూపంలో తెలియజేయండి.
ఇది చదవండి: Ramya Krishna: రమ్యకృష్ణ ఒక్కో సినిమాకు ఎంత రెమ్యూనరేషన్ తీసుకుంటుందో తెలుసా?