బిగ్‌బాస్..తెలుగు బుల్లితెరపై చేసే అల్లరి అంతా ఇంతా కాదనే చెప్పాలి. అన్ని ప్రాంతీయ భాషల్లో వెలుగొందుతున్న ఈ షోపై ప్రేక్షకుల నుంచి ఎనలేని ఆదరణ లభిస్తోంది. వెయ్యి కళ్లతో ఎదురుచూస్తున్న సీజన్-5ని ప్రారంభించేందుకు బిగ్‌బాస్ సభ్యులు అంతా ఇంతా సిద్దం చేస్తున్నారు. ఇక ఈ సారి బిగ్‌బాస్ ఓ సరికొత్తగా ముస్తాబవుతున్న్లట్లు తెలుస్తోంది. తాజాగా బిగ్‌బాస్ విడుదల చేసిన లోగోను చూస్తే స్పష్ఠంగా అర్థమవుతోంది. ఇక ఈ షో ఇప్పటికే మొదలు కావాల్సి ఉండగా కరోనా కారణంగా వాయిదా పడుతూ వస్తూ ప్రేక్షకుల ఆశలపై నీళ్లు జల్లే ప్రయత్నం చేస్తున్నారు.
ఇక ఎట్టకేలకు త్వరలో ఈ షోను వెండితెరపై పరుగులు పెట్టించేందుకు అంతా సిద్దమైంది. ఈ సారి హోస్ట్‌గా ఎవరు వస్తారనేదానిపై మాత్రం భిన్నాభిప్రాయాలు కొనసాగుతున్నాయి. ఇందులో ప్రధానంగా దగ్గుబాటి రానా, నాగార్జున పేర్లు తెరపైకి వస్తున్నాయి. మరి ఇందులో సీజన్-5 హోస్ట్ ఎవరనే ప్రశ్నకు కొన్ని రోజుల్లో సమాధానం రానుంది. దీంతో పాటు కంటెస్టెంట్ల ఎంపిక ప్రక్రియ కూడా ఇప్పిటికే జరిగిపోయింది. ఇందులో ఈ సారి ఎవరెవరు వస్తున్నారని ఓ లీస్ట్ కూడా నెట్టింట్లో హల్చల్ చేస్తోంది. అందులో యాంకర్ రవి, నవ్యస్వామి, సిరి హన్మంత్, షణ్ముఖ్ జశ్వంత్ యాంకర్ వర్షిణి వంటి పేర్లు ప్రచారంలో ఉన్నాయి.
ఇక అందాల యాంకర్ వర్షిణి నిజంగానే సీజన్-5లోకి అడుగుపెట్టబోతుందని ప్రచారం మాత్రం బలంగానే జరుగుతున్న నేపథ్యంలో తాజాగా వర్షిణి బిగ్‌బాస్‌లోకి నిజంగానే వస్తుందనటానికి ఓ పక్కా ఆధారం మాత్రం దొరికింది. అదెలా అంటారా..? తాజాగా జరిగిన కామెడీ స్టార్స్ షోలో వర్షిణి కనిపించకుండా మాయమయ్యారు. దీంతో హఠాత్తుగా శ్రీముఖి ప్రత్యక్షమయ్యారు. ఇక మొదటి రోజు శ్రీముఖి చేసిన కామెంట్లను బట్టి చూస్తే కూడా వర్షిణి ఈ షో రాకుండా బిగ్‌బాస్‌లోకి అడుగుపెట్టబోతుందని స్పష్ఠంగా తెలుస్తోంది. ఇక యాంకర్ వర్షిణి నిజంగానే బిగ్‌బాస్‌లోకి అడుగుపెడుతున్నట్లు పక్కా ఆధారాలను చూస్తే అర్ధమవుతోంది. మరి నిజంగా వర్షిణి బిగ్‌బాస్‌లోకి అడుగుపెడుతుందో లేదో అన్న ప్రశ్నకు సమాధానం కొన్ని రోజుల్లో తేలనుంది. దీనిపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.