యాంకర్ వర్షిణి సోషల్ మీడియాలో ఎంత యాక్టీవ్ గా ఉంటుందో మనకు తెలుసు. తన హాట్ హాట్ పిక్స్ తో నెట్టింట హల్ చల్ చేస్తుంటుంది ఈ ముద్దుగుమ్మ. తాజాగా మరోసారి తన అందాలతో రెచ్చిపోయింది.
ఇటు బుల్లితెరపై, అటు వెండితెరపై రాణించాలంటే అందంతో పాటుగా అభినయం, కూసింత అదృష్టం కూడా ఉండాలి. అన్నీ ఉన్నా గానీ కొంతమంది ముద్దుగుమ్మలకు సరైన అవకాశాలు రావు. ఇక అవకాశాల కోసం అప్పుడప్పుడు హాట్ ఫోటో షూట్ లు చెయ్యాల్సి వస్తుంది కూడా. దాంతో మూవీ మేకర్స్ దృష్టిలో పడాలి అన్నది వారి ముఖ్య ఉద్దేశం. అయితే ప్రస్తుతం సోషల్ మీడియా యుగంలో కొంత మంది నటీమణులు రోజుకో ఫోటో షూట్ చేసి సోషల్ మీడియాలో రచ్చ లేపుతున్నారు. తాజాగా యాంకర్ వర్షిణి తన హాట్ హాట్ పిక్స్ తో సోషల్ మీడియాలో సెగలు రేపుతోంది.
యాంకర్ వర్షణి.. తన చలాకీ మాటలతో, చురకత్తుల లాంటి చూపులతో బుల్లితెర యాంకర్ గా మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఇక వర్షిణి లంగాఓణి కడితే చూడాలని తహతహలాడుతుంటారు కుర్రకారు. అంతలా ఆమె అందం పెరిగిపోతుంది లంగాఓణిలో. ఇక వర్షిణి సోషల్ మీడియాలో ఫుల్ యాక్టీవ్ గా ఉంటూ.. తాను ఏ వెకేషన్ కు వెళ్లిన అక్కడి అందాలతో పాటుగా.. తన అందలను కూడా సోషల్ మీడియాలో షేర్ చేస్తుంటుంది. తన హాట్ హాట్ పిక్స్ తో కుర్రాళ్లకు నిద్రలేకుండా చేస్తుంది వర్షిణి. తాజాగా మరోసారి తన మత్తెక్కించే చూపులతో.. తనకే సొంతమైన అందాలతో మరోసారి సోషల్ మీడియాను షేక్ చేస్తోంది యాంకర్ వర్షిణి.
ఈ క్రమంలోనే కైపెక్కించే చూపులతో.. థైస్ అందాలతో యువకుల గుండెల్ని పిండిచేస్తోంది. హ్యాపీ వీకెండ్ అంటూ ఈ ఫోటోలను షేర్ చేసింది ఈ బుల్లితెర సోయగం వర్షిణి. ఇక కెరీర్ విషయానికి వస్తే.. పలు షోలకు యాంకరింగ్ చేస్తూనే, పలు సినిమాల్లో, వెబ్ సిరీస్ లలో నటిస్తోంది. ఇక ఏ వెకేషన్ కు వెళ్లినా అక్కడ ఫోటోలు దిగి అభిమానులతో సోషల్ మీడియాలో పంచుకుంటుంది వర్షిణి. మరి యాంకర్ వర్షిణి లేటెస్ట్ ఫోటోలపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.