దర్శక ధీరుడు రాజమౌళి దర్శకత్వంలో రామ్ చరణ్, జూనియర్ ఎన్టీఆర్, ఆలియా భట్, అజయ్ దేవ్‌గన్ వంటి భారీ తారాగణంతో తెరకెక్కిన చిత్రం ట్రిపుల్ ఆర్. కలెక్షన్ల పరంగా ఈ సినిమా గత రికార్డులన్నింటిని బద్దలు కొట్టిన సంగతి తెలిసిందే. ఇక ట్రిపుల్ ఆర్ విజయం చూసి బాలీవుడ్ ఇండస్ట్రీ ఒణికిపోయిందనే చెప్పవచ్చు. దాంతో పిచ్చి వ్యాఖ్యలు చేసిన వారు కూడా ఉన్నారు. ఇప్పటికి ఈ సినిమాపై కొందరు అనుచిత వ్యాఖ్యలు చేస్తూనే ఉన్నారు. మరీ ముఖ్యంగా పాశ్చత్య దేశాలు.. ట్రిపుల్ ఆర్ సినిమాను గే లవ్ స్టోరీ అంటూ ఎద్దేవా చేస్తున్నాయి. ఇక వారంతా అలా అన్నా ఎవ్వరూ పట్టించుకునే వారు కాదు. కానీ మన ఇండియన్ కూడా అలానే ఉన్నాడు.. అది కూడా సినిమా ఇండస్ట్రీలోని వ్యక్తి.. అందులోనూ ఆస్కార్ అవార్డును అందుకున్న వ్యక్తి. సౌండ్ డిజైనర్ రసూల్ పూకుట్టి తాజాగా ఆర్ఆర్ఆర్ సినిమాను గే స్టోరీగా చెప్పుకొచ్చాడు. ప్రస్తుతం అతడి వ్యాఖ్యలు నెట్టింట వైరల్‌గా మారాయి.
ఈ వివాదానికి కారణం ఓ నెటిజన్ చేసిన ట్వీట్. రాత్రే ఆర్ఆర్ఆర్ అనే చెత్త సినిమాను చూశాను అంటూ పోస్ట్ చేశాడు. ఆ ట్వీట్‌కు రసూల్ పూకుట్టి రిప్లై ఇస్తూ గే స్టోరీ అని అనేశాడు. దీనిపై దుమారం రెగింది. నెటిజన్లు ఆయన మీద తీవ్ర స్థాయిలో మండిపడుతున్నారు. ఇదే కాక బాహుబలి నిర్మాత శోభు యార్లగడ్డ కూడా రంగంలోకి దిగాడు. రసూల్ పూకుట్టిపై తీవ్ర అసహనం వ్యక్తం చేశాడు బాహుబలి నిర్మాత.
Saw 30 minutes of garbage called RRR last night.
— Munish (@MunishBhardwaj) July 3, 2022
శోభు యార్లగడ్డ చేసిన ట్వీట్ ఇలా ఉంది. ‘నువ్ చెప్పినట్టుగా ఆర్ఆర్ఆర్ సినిమా గే స్టోరీలా నాకు అనిపించలేదు.. సరే అది గే స్టోరీ అయినా తప్పేంటి? అదేమైనా చెడ్డ విషయమా? నువ్ అలా ఎలా అనగలవు.. నీ వ్యాఖ్యలను ఎలా సమర్థించుకోగలవు.. మీరు ఇలా దిగజారడం నాకు ఎంతో బాధగా అనిపిస్తోంది’ అంటూ శోభు యార్లగడ్డ అనేశారు.
I don’t think @RRRMovie is a gay love story as you say but even if it was, is “gay love story” a bad thing? How can you justify using this ? Extremely disappointed that someone of your accomplishments can stoop so low! https://t.co/c5FmDjVYu9
— Shobu Yarlagadda (@Shobu_) July 4, 2022
దీంతో నెట్టింట్లో ఆర్ఆర్ఆర్ మరోసారి చర్చకు దారి తీసింది. ఎంతో మంది హాలీవుడ్ డైరెక్టర్లు, టెక్నీషియన్లు, అక్కడి రివ్యూయర్లు ఆర్ఆర్ఆర్ సినిమాను ప్రశంసలతో ముంచెత్తుతున్నారు. ఎన్నెన్నో దేశాల్లో ఆర్ఆర్ఆర్ సినిమా ఘన విజయం సాధించింది. అయినా కొంత మంది ఇలాంటి వ్యాఖ్యలు చేసి ఆర్ఆర్ఆర్ స్థాయిని తగ్గించేద్దామని ప్రయత్నిస్తున్నట్టున్నారు అని నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు.