RRR: ఇటీవలే ప్రతిష్టాత్మక హాలీవుడ్ క్రిటిక్స్ అసోసియేషన్ అవార్డు(HCA)లకు ఆర్ఆర్ఆర్(RRR) ఎంపికైన సంగతి తెలిసిందే. ఇండియా నుండి ఈ అవార్డులకు ఎంపికైన ఏకైన సినిమాగా ఆర్ఆర్ఆర్ నిలిచింది. యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, దర్శకధీరుడు రాజమౌళి కాంబినేషన్‌లో తెరకెక్కిన ఈ మూవీ.. ఈ ఏడాది ఇండియన్ బాక్సాఫీస్ రికార్డులను బద్దలుకొట్టి బ్లాక్ బస్టర్ హిట్ అందుకుంది. ప్రపంచవ్యాప్తంగా దాదాపు రూ.1200 కోట్లకు పైగా వసూలు చేసి ఇండియన్ టాప్ మూవీస్ లో ఒకటిగా నిలిచి.. బెస్ట్ పిక్చర్ కేటగిరిలో హాలీవుడ్ క్రిటిక్స్ అసోసియేషన్ అవార్డుకు నామినేట్ అయింది. ఈ కేటగిరిలో ఆర్ఆర్ఆర్ కి పోటీగా టాప్ గన్ మావ్రీక్, ది బ్యాట్‌మెన్, టర్నింగ్ రెడ్, ఎవరీథింగ్ ఎవరివన్ ఆల్ ఎట్ వన్స్ తదితర సినిమాలు నామినేట్ అయ్యాయి. నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ అయినప్పటి నుండి RRR గురించి హాలీవుడ్ దర్శకనిర్మాతలు, విమర్శకులు విపరీతంగా చర్చించుకున్నారు. 1920 కాలంలో బ్రిటీష్ నేపథ్యంతో తెరకెక్కిన ఈ మూవీలో ఎన్టీఆర్ కొమురం భీమ్‌గా.. రామ్ చరణ్ అల్లూరి సీతారామరాజు పాత్రలలో నటించారు. ఇద్దరు యోధులు కలిసి బ్రిటీష్ ని అప్పట్లో ఎదురిస్తే.. ఎలా ఉంటుందనే ఆలోచనతో జక్కన్న ఈ మూవీని రూపొందించారు. అయితే.. తాజాగా ఈ అవార్డ్స్ ఫలితాలు వెల్లడయ్యాయి. బెస్ట్ పిక్చర్ గా కొరియన్ మూవీ 'ఎవరీథింగ్ ఎవరీవేర్ ఆల్ ఎట్ వన్స్' గెలుపొందగా.. ఆర్ఆర్ఆర్ రన్నరప్ గా నిలిచింది. ఈ క్రమంలో ఆర్ఆర్ఆర్ మూవీని అంత గొప్పగా తెరకెక్కించినందుకు దర్శకుడు రాజమౌళి పై ఇండియన్ మేకర్స్, ఫ్యాన్స్, ఆర్టిస్టులు ప్రశంసలు కురిపిస్తున్నారు. టాలీవుడ్ దర్శకులు హిట్ కోసం ట్రై చేస్తుంటే.. రాజమౌళి ఇండస్ట్రీ హిట్ కొట్టాడు. అదే డైరెక్టర్స్ ఇండస్ట్రీ హిట్ కోసం ట్రై చేస్తుంటే.. రాజమౌళి పాన్ ఇండియా హిట్ కొట్టి ఆయన సత్తాను, తెలుగు సినిమా ఖ్యాతిని ప్రపంచవ్యాప్తంగా చాటాడు. ఇప్పుడు ఆర్ఆర్ఆర్ సినిమాతో ప్రపంచ దేశాలన్నీ రాజమౌళి గురించి మాట్లాడుకుంటున్నాయి. ఈ ఘనత రాజమౌళికే దక్కుతుంది. మొదటినుండి కూడా రాజమౌళి అందరు డైరెక్టర్స్ కంటే ముందు ఆలోచనతో, ఒక అడుగు ముందుగానే ఆలోచిస్తూ వచ్చాడు అనడానికి.. ప్రస్తుతం ఆయన పొందుతున్న ఆదరణే నిదర్శనం. ఆర్ఆర్ఆర్ మూవీ మున్ముందు మరెన్నో రికార్డులు తిరగరాయనుంది. మరి ఆర్ఆర్ఆర్ మూవీ హాలీవుడ్ క్రిటిక్స్ అసోసియేషన్ అవార్డులలో రన్నరప్ గా నిలవడంపై మీ అభిప్రాయాలను తెలియజేయండి. And the winner of the HCA Midseason Award for Best Picture goes to… Everything Everywhere All At Once Runner up: RRR #HCAMidseasonAwards #A24 #EverythingEverywhereAllAtOnce @A24 @EEAAOA24 pic.twitter.com/PMrxkgWVQ1 — Hollywood Critics Association (@HCAcritics) July 1, 2022 The Nominees for Best Picture are...#ChaChaRealSmooth #ElvisMovie #EverythingEverywhereAllAtOnce #MarcelTheShellWithShoesOn#RRRMovie #TheBatman #TheNorthman #TheUnbearableWeightofMassiveTalent#TopGunMaverick #TurningRed #HCAMidseasonAwards #BestPicture pic.twitter.com/ATSKRYusco — Hollywood Critics Association (@HCAcritics) June 28, 2022