Shivathmika Rajashekar : యాంగ్రీ యంగ్ మ్యాన్ రాజశేఖర్, జీవితల కుమార్తెగా ఓ స్టార్ కిడ్ హోదాతో సినీ రంగ ప్రవేశం చేశారు శివాత్మిక. దొరసాని సినిమాతో వెండి తెరపైకి అడుగుపెట్టారు. ఇప్పటివరకు అందాల ఆరబోతకు అవకాశం లేకుండా.. నటనకు అవకాశం ఉన్న పాత్రలను చేసుకుంటూ వెళ్లారు. అయితే, ఇకపై శివాత్మిక కొద్దిగా గ్లామర్ డోస్‌ను పెంచే అవకాశం ఉన్నట్లు కనిపిస్తోంది. ఇందుకు ఆమె దుబాయ్ ఫొటో షూట్ బలం చేకూరుస్తోంది. దుబాయ్ ఫొటో షూట్‌లో కుర్రకారు మతి పోయేలా ఫొటోలకు ఫోజులిచ్చారామె. హాట్ క్లీవేజ్ లుక్‌లో దర్శనమిచ్చారు. ప్రస్తుతం ఈ ఫొటో షూట్ చిత్రాలు సోషల్‌మీడియాలో వైరల్‌గా మారాయి.
కాగా, శివాత్మిక ఏప్రిల్ 22, 2000ల సంవత్సరంలో హైదరాబాద్‌లో జన్మించారు. శివాత్మిక ఎంబీబీఎస్ పూర్తి చేశారు. శివాత్మిక అక్క శివాని కూడా సినిమా నటి. శివాత్మిక 2021 సెప్టెంబర్ 17న హైదరాబాద్‌లోని జేఆర్‌సీ కన్వెన్షన్ హాలులో జరిగిన సాక్షి మీడియా 2020 ఎక్స్‌లెన్స్ అవార్డుల కార్యక్రమంలో బెస్ట్ డెబ్యూ యాక్ట్రెస్ అవార్డును అందుకున్నారు. శివాత్మిక దుబాయ్ ఫొటోస్‌పై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేండి.
ఇవి కూడా చదవండి : భార్య మీద కుళ్లు జోకు.. స్టేజీ మీదే చెంప పగలకొట్టిన స్టార్ హీరో!