శివ శంకర్ మాస్టర్.. సౌత్ సినీ ఇండస్ట్రీలో నటరాజుకి మారు రూపం ఆయన. 4 దశాబ్దాల సినీ ప్రయాణం. 800 సినిమాలకి పని చేసిన అనుభవం. మొత్తం వేల పాటలకి డ్యాన్స్ లు కంపోజింగ్, ఎన్నో అవార్డులు, మరెన్నో రివార్డులు.. ఇలా శివ శంకర్ మాస్టర్ సాధించిన ఖ్యాతి గురించి చెప్పాలంటే మాటలు సరిపోవు. మరి.. కెరీర్ లో ఇంత సాధించిన మాస్టర్ చివరి కోరిక ఎందుకు తీరలేదు? అసలు మాస్టర్ చివరి కోరిక ఏమిటి? ఇప్పుడు తెలుసుకుందాం.
శివ శంకర్ మాస్టర్ తన జీవిత కాలంలో చాలానే ఆస్తి సంపాదించారు. కానీ.., ఆయన తనకంటూ ఏమి దాచుకోలేదు. ఎందుకంటే మాస్టర్ ఎప్పుడు కూడా డబ్బుకి అంతగా ప్రాధాన్యం ఇవ్వలేదు. కానీ.., కుటుంబాన్ని సెటిల్ చేయడానికి చాలా కష్టపడ్డారు. మాస్టర్ తన పెద్ద కోడలు కారణంగా నరకం అనుభవించారు. ఆ సమయంలో ఆయన చనిపోవాలని కూడా అనుకున్నారు. కానీ.., ఇన్ని బాధల మధ్య కూడా మాస్టర్ ఎప్పుడూ డ్యాన్స్ ని వదులుకోలేదు. గతంలో ఓ ఇంటర్వ్యూలో మాస్టర్ కి ఇదే ప్రశ్న ఎదురైంది.
మాస్టర్ ఇప్పుడు మీకు వయసు పైన పడిపోయింది. సినిమాల్లో క్లాసికల్ సాంగ్స్ ప్రాధాన్యత తగ్గిపోయింది. ఇలాంటి సమయంలో కూడా మీరు ఎందుకు డ్యాన్స్ పై ఇంత ఇష్టాన్ని చూపిస్తున్నారు అన్న ప్రశ్న మాస్టర్ కి ఎదురైంది. దానికి శివ శంకర్ మాస్టర్ చాలా ఉద్వేగంగా సమాధానం ఇచ్చారు.
“నాకు డబ్బు మీద, ఆస్తుల మీద వ్యామోహాలు లేవు. నాకు ఆ నటరాజు దయ వల్ల కళ అబ్బింది. ఆ కళని నా చావు తరువాత కూడా బతికించుకుంటే చాలు. సెట్ లో డ్యాన్స్ చేస్తుండగానే నా ప్రాణం పోవాలి. డ్యాన్స్ లేకుండా నన్ను నేను ఉహించుకోలేను. అదే నా చివరి కోరిక” అని మాస్టర్ తెలియజేశారు. కానీ,, శివ శంకర్ మాస్టర్ చివరి రోజుల్లో ఆరోగ్యం అంతంగా సహకరించకుండా వచ్చింది. దీంతో.. ఆయన డ్యాన్స్ కి పూర్తిగా దూరం అయిపోయారు. అంతేకాదు.. చివరికి కరోనా కారణంగా హాస్పిటల్ లో మాస్టర్ కన్నుమూయాల్సి వచ్చింది. ఈ లెక్కన చూస్తే.. మాస్టర్ చివరి కోరిక తీరలేదు. కానీ.., ఆయన తన ఊపిరి ఉన్నంత కాలం డ్యాన్స్ కోసమే పరితపించి, ఆ నటరాజు పాదాల చెంతకి చేరారు. ఈ లెక్కన చూస్తే.. స్వార్ధం లేని మాస్టర్ చివరి కోరిక తీరినట్టే. మరి.. చివరి వరకు కళ కోసమే బతికిన శివ శంకర్ మాస్టర్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.