బిగ్ బాస్ టీవీ షోని తెలుగు ప్రేక్షకులు ఏ స్థాయిలో ఆదరించారో.. బిగ్ బాస్ ఓటిటి వెర్షన్ ని మాత్రం ఆ స్థాయిలో ఆదరించడం లేదు అనేది వాస్తవమనే చెప్పాలి. ఇదివరకు టీవీ షో కాబట్టి ఇంట్లో ఉన్నవాళ్లు, స్మార్ట్ ఫోన్స్ ఉన్న ప్రేక్షకులు చూసేవారు.. ఇప్పుడు ఓటిటి వెర్షన్ అయ్యేసరికి కేవలం స్మార్ట్ ఫోన్స్ ఉన్నవారు మాత్రమే చూసే ఛాన్స్ ఉంది. ఎలాగో ఫ్యామిలీ ఆడియెన్స్ డిస్నీ హాట్ స్టార్ యాప్ డౌన్ లోడ్ చేసుకొని చూసేంత ఇంటరెస్ట్ చూపించలేరు.
అదీగాక ఇప్పుడున్న ఓటిటి షోలో సగానికి పైగా గత సీజన్లలో చూసిన ముఖాలే కావడం మరో కారణం. బిగ్ బాస్ లో పాల్గొనేవారిని ఒక సీజన్, రోజుకో గంట ఎపిసోడ్ భరించాలి అంటేనే కష్టం.. అలాంటిది ఓటిటి 24 గంటలు లైవ్ అంటే.. ఇంకేం చూస్తామని అంటున్నారు నెటిజన్లు. ఇదిలా ఉండగా.. ప్రస్తుతం జరుగుతున్న బిగ్ బాస్ ఓటిటి హౌస్ లో కంటెస్టెంట్స్ మధ్య టాస్కులు కూడా అంత ఆసక్తికరంగా లేవనేది ఆడియెన్స్ అభిప్రాయం.ఇక ఇటీవలే బిగ్ బాస్ కంటెస్టెంట్స్ కి ‘ట్రూత్ ఆర్ డేర్‘ గేమ్ పెట్టారు. వీల్ తిరిగి ఎవరివైపు ఆగుతుందో.. వారు కార్డులో ఉన్న ప్రశ్నకు సమాధానం చెప్పాలి. ఆ ప్రశ్న వారి కెరీర్, పర్సనల్ లైఫ్ ఇలా దేనికైనా సంబంధించి ఉండవచ్చు. అయితే.. ఈ గేమ్ లో అందరు పాల్గిన్నారు. కానీ యాంకర్ శివ, నటరాజ్ మాస్టర్ మాత్రం అందరికి షాకిచ్చారు.
ఈ గేమ్ లో యాంకర్ శివకి.. ‘ఎప్పుడైనా పెళ్ళైన మహిళతో డేటింగ్ చేశారా?’ అనే పప్రశ్న అడిగారు. దానికి స్పందించిన శివ.. ‘అసలు స్టార్ట్ అయ్యిందే పెళ్ళైన మహిళతో.. ఫస్ట్ ఎక్సపీరియన్సు తనే’ అని చెప్పేశాడు. అలాగే నటరాజ్ మాస్టర్ కి.. ‘పెళ్లి కాకముందు ఎంతమందితో డేట్ చేశారు?’ అని అడిగారు. దానికి.. ‘120 మందికి పైనే..’ అని అందరికి షాకిచ్చాడు. కానీ చివరిలో అట్రాక్షన్ అని కవర్ చేశాడు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. మరి ఈ వీడియో పై మీ అభిప్రాయాలను కామెంట్స్ లో తెలియజేయండి.