ఇటీవల కాలంలో సోషల్ మీడియా స్నేహాలు సరిహద్దులే కాదూ.. హద్దులు కూడా దాటేస్తున్నాయి. ఫేస్ బుక్, ట్విట్టర్, ఇన్ స్టా వంటి సోషల్ మీడియా ఫ్లాట్ ఫామ్స్ అందుకు వేదికగా నిలుస్తున్నాయి. వీటి ద్వారా ముక్కు, మోహం సరిగ్గా తెలియని వ్యక్తులతో పరిచయం ఏర్పడి..
ఇటీవల కాలంలో సోషల్ మీడియా స్నేహాలు సరిహద్దులే కాదూ.. హద్దులు కూడా దాటేస్తున్నాయి. ఫేస్ బుక్, ట్విట్టర్, ఇన్ స్టా వంటి సోషల్ మీడియా ఫ్లాట్ ఫామ్స్ అందుకు వేదికగా నిలుస్తున్నాయి. వీటి ద్వారా ముక్కు, మోహం సరిగ్గా తెలియని వ్యక్తులతో పరిచయం ఏర్పడి.. ఆపై స్నేహం గీతం ఆలపించి.. మోసపోతున్నారు అనేక మంది, ముఖ్యంగా అమ్మాయిలు, మహిళలు. కేటుగాళ్ల వలకు పడిపోతున్నారు అమ్మాయిలు. తమతో పరిచయం ఏర్పడిన సమయంలో దిగిన ఫోటోలను చూపించి బ్లాక్ మెయిల్ చేయడం, మాట వినకపోతే వాటిని తల్లిదండ్రులకు పంపిస్తాననడం లేదంటే సోషల్ మీడియా వెబ్ సైట్లలో పెడతాననడంతో భయపడి లొంగిపోతున్నారు అమ్మాయిలు. ఇటువంటి ఘటనే కర్ణాటకలోని బెంగళూరులో జరిగింది.
ఈ సోషల్ మీడియానే ఆ కాలేజీ విద్యార్థిని పట్ల శాపంగా మారింది. చివరకు బాధితురాలిగా మిగిలింది. వివరాల్లోకి వెళితే.. బెంగళూరులోని కొడిగేహళ్లి పోలీస్‌స్టేషన్ పరిధిలో కళాశాల విద్యార్థినికి సోషల్ మీడియా ద్వారా ఆండీ జార్జ్ అనే వ్యక్తికి పరిచమయ్యాడు. అతడు ఓ స్కూల్లో డ్యాన్స్ టీచర్‌గా పనిచేస్తున్నాడు. ఈ పరిచయం ప్రేమకు దారి తీసింది. వీరిద్దరూ కలిసి తిరిగారు. ఆ క్షణాలను ఫోటోలు, వీడియోల రూపంలో బంధించుకున్నారు. అయితే ఆ వీడియోలతో విద్యార్థినిని బెదిరించడం మొదలు పెట్టారు. దీంతో ఆమె.. అతడిని దూరం పెట్టింది. మన ప్రైవేట్ వీడియోలను షేర్ చేస్తానని చెప్పడంతో అతడికి లొంగిపోయింది. ఆ ఫోటోలను చూపిస్తే పలుమార్లు అత్యాచారానికి ఒడిగట్టాడు.
వాటిని వీడియోలు తీసి.. బెదిరించి.. తన స్నేహితులు సంతోష్, శశిలతో కలిసి సామూహిక అత్యాచారానికి ఒడిగట్టాడు. ఆ వీడియోలను నిందితుడు సోషల్ మీడియాలో పోస్టు చేయడంతో.. విద్యార్థిని పోలీసులకు ఫిర్యాదు చేసింది. సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారనే ఆరోపణలపై డ్యాన్స్ టీచర్‌తో సహా ముగ్గురిని అరెస్టు చేసినట్లు పోలీసులు మంగళవారం తెలిపారు. మొబైల్ ఫోన్, పెన్ డ్రైవ్‌ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఇలాంటి అనేక కేసుల్లో ఆండీ ప్రమేయం ఉన్నట్లు పోలీసులు నిర్ధారించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.