ప్రముఖ సినీ రచయిత ఇంటిపై కొందరు దాడికి యత్నించారు. ఇంట్లోకి చొరబడి ఆయనకు వార్నింగ్ ఇచ్చారు. అదే విషయంపై ఆయన శంకరపల్లి పీఎస్ లో ఫిర్యాదు చేశారు.
వివరాల్లోకి వెళ్తే.. ప్రముఖ సినీ రచయిత చిన్నకృష్ణ శంకర్ పల్లి పోలీసులను ఆశ్రయించారు. శంకర్ పల్లి గ్రామ పంచాయితీ పరిధిలోని తన స్థలాన్ని కొందరు ఆక్రమించడంతో.. చిన్నకృష్ణ హైకోర్టును ఆశ్రయించారు. స్టే ఆర్డర్ తెచ్చుకోవడంతో కొందరు స్థానిక రియల్టర్లు ఆగ్రహానికి గురయ్యారు. ఆయన ఇంటిపై దాడికి వెళ్లారు. కొవిడ్ తో బాధపడుతున్న తనపై ఇంట్లోకి చొచ్చుకొచ్చి దాడి చేసేందుకు యత్నించారని, పరుష పదజాలంతో దూషించారని చిన్నికృష్ణ ఆరోపిస్తున్నారు. స్థానిక పంచాయతీ.. తన స్థలానికి క్లియర్ పిక్చర్ కూడా ఇచ్చారని చెప్పారు. కోర్టులను కూడా అగౌరవ పరిచేలా మాట్లాడుతున్నారని చిన్నికృష్ణ ఆవేదన వ్యక్తం చేశారు. దాడిపై విషయంపై పలువురు ఇండస్ట్రీ ప్రముఖులు చిన్నికృష్ణకు ఫోన్ చేసి ఆరా తీశారు.
pic.twitter.com/gvuZbzOm27
— bade raja (@baderaja04) February 19, 2022