RRR.. బాహుబలి తర్వాత దర్శకుడు రాజమౌళి తెరకెక్కించిన మరో భారీ చిత్రం. తాజాగా థియేట్రికల్ రిలీజ్ అయిన ఈ సినిమా తెలుగుతో పాటు ప్రపంచవ్యాప్తంగా సినీ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంటోంది. ఫస్ట్ షో నుండే పాజిటివ్ టాక్ రావడంతో ఆర్ఆర్ఆర్ కలెక్షన్స్ లో కూడా కొత్త రికార్డులు సృష్టించే అవకాశాలు పుష్కలంగా కనిపిస్తున్నాయి. అంతేగాక.. తెలుగు రాష్ట్రాలలో టికెట్ ధరలు పెంచుకునేందుకు అనుమతులు లభించడంతో సినిమా రికార్డులు ఖాయం అంటున్నారు విశ్లేషకులు.
ఇక ఆర్ఆర్ఆర్ రిలీజ్ అయ్యిందో లేదో అప్పుడే ఈ సినిమాకు సంబంధించి ఓ క్రేజీ న్యూస్ సినీ వర్గాలలో వైరల్ అవుతోంది. జూ.ఎన్టీఆర్, రాంచరణ్ హీరోలుగా తెరకెక్కిన ఈ పాన్ ఇండియా మల్టీస్టారర్ మూవీకి సీక్వెల్.. అంటే ‘RRR 2’ రానుందనే వార్తలు ఫిలిం నగర్ లో చక్కర్లు కొడుతున్నాయి. పీరియాడిక్ నేపథ్యం అయినప్పటికీ.. కాన్సెప్ట్ కల్పితం అన్నారు. కాబట్టి సినిమాకు సీక్వెల్ ఉంటుందని.. అదీగాక సినిమా సూపర్ సక్సెస్ టాక్ తెచ్చుకుంది కనుక జక్కన్న బృందంలో కూడా చర్చలు జరుగుతున్నాయని టాక్ బలంగా వినిపిస్తోంది.
ఇది చదవండి: RRR మూవీ రివ్యూ!
ఎలాగో రాజమౌళి టీమ్ బాహుబలి 3 చేయనున్నట్లు ఈ మధ్య ఇంటర్వ్యూలలో క్లారిటీ ఇచ్చారు. కాబట్టి ఆర్ఆర్ఆర్ సినిమాకు కూడా స్టోరీ డెవలప్ చేసుకునే స్కోప్ ఉందని, అలాగే త్వరలో ఆర్ఆర్ఆర్ సీక్వెల్ పై కూడా క్లారిటీ ఇవ్వనున్నారని సినీవర్గాలు చెబుతున్నాయి. ఇదిలా ఉండగా.. ఇద్దరు స్టార్ హీరోల మల్టీస్టారర్ విజువల్ ఫీస్ట్ ని.. డీవీవీ దానయ్య భారీ బడ్జెట్ తో నిర్మించారు. అలియా భట్, అజయ్ దేవగన్ కీలకపాత్రలలో కనిపించారు. మరి ట్రిపుల్ ఆర్ మూవీకి సీక్వెల్ రావడం పై మీరేమంటారు. మీ అభిప్రాయాలను కామెంట్స్ లో తెలియజేయండి.