రాజమౌళితో సినిమా అంటే ఏ హీరో అయినా ఎగిరి గంతులేస్తారు. కానీ అల్లరి నరేష్ మాత్రం రాకరాక అవకాశం వస్తే చేతులారా మిస్ చేసుకున్నారు. ఆ సినిమా ఏంటో తెలుసా?
రాజమౌళి టాలీవుడ్ జక్కన్న, అమరశిల్పి. ఏదైనా సినిమా చేస్తున్నారంటే ఒక శిల్పిలా చెక్కుతుంటారు. అపజయమంటూ లేని దర్శక ధీరుడు రాజమౌళి. స్టూడెంట్ నంబర్ వన్ తో మొదలుపెట్టి సింహాద్రి, సై, ఛత్రపతి, మగధీర, ఈగ, బాహుబలి, మొన్న ఆర్ఆర్ఆర్ ఇలా ఏ సినిమా చేసినా బ్లాక్ బస్టర్ హిట్ గ్యారంటీ. బాహుబలి సినిమాతో తెలుగు సినిమా ఖ్యాతిని ప్రపంచానికి చాటి చెప్పిన ఘనత, తెలుగు సినిమాకి ఆస్కార్ అవార్డు వచ్చేలా చేసిన ఘనత రాజమౌళిది. అలాంటి రాజమౌళితో సినిమా చేయాలని ప్రతి ఒక్కరూ కల కంటారు. స్టార్ హీరోలు సైతం క్యూ కడతారు. అవసరమనుకుంటే రెండు, మూడేళ్లు సినిమాలు వదులుకోవడానికి కూడా సిద్ధపడతారు. రాజమౌళి సినిమాలో హీరోగా కాదు, చిన్న పాత్ర చేసినా చాలని అనుకుంటారు.
అలాంటిది రాజమౌళితో సినిమా చేసే అవకాశం వస్తే మిస్ అల్లరి నరేష్ చేసుకున్నారు. ఆ సినిమా కనుక అల్లరి నరేష్ చేసి ఉంటే ఓ రేంజ్ లో ఉండేది. ఇంతకే ఆ సినిమా ఏంటో తెలుసా? సునీల్ నటించిన మర్యాద రామన్న. అప్పటికే మగధీర లాంటి బ్లాక్ బస్టర్ కొట్టిన రాజమౌళి.. చిన్న బడ్జెట్ లో చిన్న సినిమాని తీశారు. సునీల్ హీరోగా, సలోని హీరోయిన్ గా కామెడీ డ్రామాగా తెరకెక్కిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద ఘన విజయాన్ని అందుకుంది. అప్పట్లో ఈ మూవీ 34 కోట్ల రూపాయల షేర్ వసూళ్లను రాబట్టింది. అయితే ఈ మూవీలో హీరో పాత్ర కోసం సునీల్ కంటే ముందు ఇతర హీరోలను సంప్రదించారట రాజమౌళి. వారిలో అల్లరి నరేష్ ఒకరు. మర్యాద రామన్న కథ చెప్పగానే అల్లరి నరేష్ ఒప్పుకున్నారట.
కానీ సినిమా పూర్తయ్యే వరకూ వేరే ప్రాజెక్ట్ చేయకూడదని రాజమౌళి చెప్పడంతో అల్లరి నరేష్ వెనక్కి తగ్గారట. ఏడాదికి అర డజను సినిమాలతో ఫుల్ బిజీగా ఉండే నరేష్.. అన్ని రోజులు వేరే ప్రాజెక్ట్స్ చేయకుండా ఉండడం అంటే కష్టమని ఆఫర్ ను వదులుకున్నారట. దీంతో నరేష్ నుంచి సునీల్ దగ్గరకు వెళ్ళింది. ఈ సినిమాలో సునీల్ చాలా అద్భుతంగా నటించారు. ఇందులో సందేహం లేదు. కానీ ఈ పాత్రకు అల్లరి నరేష్ కూడా సెట్ అవుతారు. ఇప్పుడంటే అల్లరి నరేష్ అల్లరి తగ్గించి సీరియస్ పాత్రలు చేస్తున్నారు గానీ అప్పుడు కనుక మర్యాద రామన్న సినిమా చేసి ఉంటే ఓ రేంజ్ లో ఉండేది. కానీ అప్పటి పరిస్థితులు అలాంటివి. ఇప్పుడు రాజమౌళితో సినిమా చేసే అవకాశం వస్తుందో లేదో. మగధీర తర్వాత చిన్న మర్యాద రామన్న సినిమా చేసినట్టు.. ఇప్పుడు కూడా ఏదైనా చిన్న సినిమా చేయాలన్న ఆలోచన వస్తే అల్లరి నరేష్ కి ఛాన్స్ ఇస్తారేమో చూడాలి.