సాధారణంగా ఫిల్మ్ ఇండస్ట్రీలో బయోపిక్‌లు అనేవి ఫెయిలవ్వవు. అలానే ఒక సినిమా హిట్ అయితే తర్వాత దానికి సీక్వెల్ మూవీ తీసే పనిలో పడతారు దర్శకులు. సిల్క్ స్మిత జీవిత కథ ఆధారంగా 2011లో డర్టీ పిక్చర్ సినిమా వచ్చిన సంగతి తెలిసిందే. ఈ సినిమా దేశవ్యాప్తంగా ఒక సెన్సేషన్‌ని క్రియేట్ చేసింది. హిందీతో పాటు తెలుగు, తమిళ భాషల్లో వచ్చిన ఈ మూవీలో సిల్క్ స్మిత పాత్రలో విద్యాబాలన్ నటించింది. ఈమె హాట్ పెర్ఫార్మెన్స్తో ఊర మాస్ నుంచి క్లాస్ ఆడియన్స్ వరకూ ప్రతీ ఒక్కరికీ మెంటలెక్కించేసింది ఈ బోల్డ్ బ్యూటీ. పేరుకి డర్టీ పిక్చర్ అయినా గానీ కథ విషయంలో గుడ్ పిక్చర్‌గా పేరు తెచ్చుకుంది. ఈ సినిమా విమర్శకుల ప్రశంసలు అందుకుంది. ఈ సినిమాతో విద్యాబాలన్‌కి మరింత క్రేజ్ ఏర్పడింది.
తాజాగా ఈ సినిమా సంబంధించి లేటెస్ట్ అప్డేట్ ఒకటి వచ్చింది. ఈ సినిమాకి సీక్వెల్ ప్లాన్ చేస్తున్నట్లు బాలీవుడ్ టాక్. ఈ మూవీ నిర్మాత ఏక్తాకపూర్ సీక్వెల్ కోసం ప్లాన్ చేశారని, స్క్రిప్ట్ కూడా ఫైనల్ చేశారని తెలుస్తోంది. ఇక ఈ సినిమాలో విద్యాబాలన్ నటిస్తోందని, పాత్ర కోసం సన్నబడుతోందని వార్తలు వస్తున్నాయి. మరోవైపు ఏక్తాకపూర్ కంగనా రనౌత్‌ను సంప్రదించిందని, అయితే కంగనాకున్న ఇమేజ్ పోతుందేమో అన్న భయంతో ఆమె నిరాకరించినట్లు సమాచారం. మరోవైపు తాప్సీ, కృతిసనన్లు ఈ మూవీలో నటించేందుకు ఉత్సాహం చూపిస్తున్నట్లు టాక్. మరి ఇందులో నిజమెంత ఉందో తెలియదు గానీ డర్టీ పిక్చర్ అభిమానులు మాత్రం విద్యాబాలన్‌నే సీక్వెల్లో కూడా నటించాలని కోరుకుంటున్నారు. మరి డర్టీ పిక్చర్ 2లో ఏ హీరోయిన్ నటిస్తే బాగుంటుందో మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి.
Kangana Ranaut Turns Down The Dirty Picture 2’s ‘Bold & S*xy’ Role Due To Fear Of Disturbance In Her Righteous Image?#KanganaRanaut #thedirtypicture2 #bollywood #koimoihttps://t.co/VkWIds7bjr
— Koimoi.com (@Koimoi) August 16, 2022