సీనియర్ హీరోయిన్ రాధిక.. అప్పట్లో తెలుగు, తమిళ్ సినిమాలో నటించి నటనపరంగా మంచి మార్కులే కొట్టేసింది ఈ హీరోయిన్. రాడాన్ పిక్చర్స్ అనే సంస్థను స్థాపించి ప్రస్తుతం సన్ నెట్ వర్క్ ద్వారా ప్రసారమౌతున్న చాలా తమిళ, తెలుగు ధారావాహికలను రాధిక నిర్మిస్తూ వస్తుంది. అయితే తాజాగా ఆలీతో సరదాగా షోలో పాల్గొన్న ఆమె కొన్ని ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేయడంతో పాటు సరదా సరదా ముచ్చట్లు చెప్పుకొచ్చింది. తాజాగా విడుదలైన ఈ ప్రోమో వైరల్ గా మారింది.
ఇది కూడా చదవండి: కత్రీనా కైఫ్ నిజంగానే ప్రెగ్నెంటా? వీడియో వైరల్!
అయితే ఈ ప్రోమోలో రాధిక ఆ సినిమా షూటింగ్ సమయంలో చిరంజీవిని కొట్టి కొట్టి మాట్లాడానని. అప్పుడు నేను 23 టేక్స్ తీసుకున్నాను అని తెలిపింది. అది అవ్వగానే చిరంజీవి మొహం చూస్తే ఎర్రగా మారిందంటూ రాధిక గులాబీ రెకులను చూపించింది. దీనికి సంబంధించిన ప్రోమో ఇప్పుడు కాస్త వైరల్ గా మారింది. ఇక రాధిక పాల్గొన్న ఆలీతో సరదాగా పూర్తి వీడియో ఎప్పుడు బయటకు వదులుతారా? అని నెటిజన్స్ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. చిరంజీవిపై రాధిక చేసిన ఫన్నీ కామెంట్స్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.
మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం SumanTV App డౌన్లోడ్ చేసుకోండి.