వరుస మరణ వార్తలు సినీ పరిశ్రమని శోక సంద్రంలో ముంచుతున్నాయి. ప్రభాస్, మహేష్ బాబు వంటి హీరోలు తమ ఇంటి పెద్ద దిక్కును కోల్పోయిన బాధలో ఉన్నారు. ఇండస్ట్రీ కూడా పెద్ద దిక్కు కోల్పోయామన్న భావనలో ఉన్నారు. ప్రేక్షకులు, అభిమానులు సైతం వారు లేని లోటును భర్తీ చేయలేరన్న బాధలో ఉన్నారు. ఈ మరణ వార్తలను మరిచిపోక ముందే ఒకప్పటి హీరోయిన్, సీనియర్ నటి ఇంట విషాదం నెలకొంది. హీరోయిన్ గా ఒక వెలుగు వెలిగిన ఖుష్బూ సుందర్.. తెలుగు, తమిళ, మలయాళ భాషల్లో నటించి ఎంతోమంది అభిమానులను సొంతం చేసుకున్నారు. చిరంజీవి, వెంకటేష్, నాగార్జున వంటి హీరోలతో నటించి మెప్పించిన ఖుష్బూ.. ప్రస్తుతం బుల్లితెర షోస్ చేస్తున్నారు.
స్టాలిన్, యమదొంగ, అజ్ఞాతవాసి, ఆడవాళ్లు మీకు జోహార్లు వంటి కీలక పాత్రల్లో నటించి మెప్పించారు. ఒక పక్క సినిమాలు, మరోపక్క షోలు జీవితం ఆనందంగా సాగిపోతున్న తరుణంలో అలజడి ఏర్పడింది. ఖుష్బూ ఇంట విషాదం నెలకొంది. ఆమె సొంత అన్నయ్య ఇవాళ మృతి చెందారు. ఈ విషాదకర వార్తను ఆమె ట్విట్టర్ వేదికగా ఆమె వెల్లడించారు. ఖుష్బూ 1970లో సెప్టెంబర్ 29న ముంబైలోని అంధేరిలో జన్మించారు. అసలు పేరు నఖత్ ఖాన్. ఈమెకు ముగ్గురు అన్నయ్యలు ఉన్నారు. అబ్దుల్లా, అబూ బాకర్, అలీ. అబ్దుల్లా ఇవాళ కాలం చెందారు. గత కొన్ని రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న కారణంగా వారం కిందట ఆసుపత్రికి తరలించారు.
పరిస్థితి విషమించడంతో వెంటిలేటర్ పై చికిత్స అందించారు. అయితే రెండు రోజులు ఆరోగ్యం నిలకడగానే ఉన్న.. ఇవాళ విషమించడంతో చనిపోయారు. తన అన్న మృతిని జీర్ణించుకోలేని ఖుష్బూ.. ట్విట్టర్ వేదికగా భావోద్వేగమైన పోస్ట్ పెట్టారు. మనం ఎంతగానో ప్రేమించే వ్యక్తులు ఎప్పటికీ మనతోనే ఉండాలని అనుకుంటాము, కానీ సమయం వస్తే గుడ్ బై చెప్పాల్సిందే. నా అన్న ప్రయాణం ఇవాల్టితో ముగిసింది. అతని ప్రేమ, మార్గదర్శకత్వం ఎల్లప్పుడూ మాపై ఉంటాయి. ఆయన బతకాలని ప్రార్థించిన ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు. పెద్దలు చెప్పినట్లు, జీవిత ప్రయాణాన్ని భగవంతుడు నిర్ణయిస్తాడు. అన్నయ్య ఆత్మకు శాంతి చేకూరాలి” అంటూ ట్వీట్ చేశారు. ఇక ఖుష్బూ సోదరుడు నటుడిగా కొన్ని చిత్రాల్లో కూడా ఈయన నటించారు.
As much as you want your loved ones to be with you forever,time comes to say goodbye. My brother’s journey has ended today. His love & guidance will always be us. I thank everyone who have prayed for him. As they say,the journey of life is decided by God. Rest in peace #Bhaijaan. pic.twitter.com/Ryh0AsaZRC
— KhushbuSundar (@khushsundar) December 17, 2022