ఈ మధ్యకాలంలో సినీ ఇండస్ట్రీకి సంబంధించిన సెలబ్రిటీల హోమ్ టూర్స్ గురించి వింటున్నాం.. వీడియోలు చూస్తున్నాం. ఇప్పటికే టాలీవుడ్ ఇండస్ట్రీలో ఎన్నో ఏళ్లపాటు వెలుగు వెలిగిన చాలామంది సీనియర్ యాక్టర్ల ఇళ్లను చూశాం. అదేవిధంగా ప్రస్తుతం ఫామ్ లో ఉన్న నటీనటుల ఇళ్లను కూడా హోమ్ టూర్ వీడియోలలో చూస్తునే ఉన్నాం. ఈ క్రమంలో తెలుగు చిత్రపరిశ్రమలో గొప్ప నటుడిగా ఎన్నో విభిన్నమైన పాత్రలు పోషించిన సీనియర్ నటుడు ఎం. ప్రభాకర్ రెడ్డి గురించి తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు.
మందాడి ప్రభాకర్ రెడ్డి గారు ఈ తరానికి తెలియకపోవచ్చు. కానీ అన్నగారు ఎన్టీఆర్, ఏఎన్ఆర్ ల కాలం నుండి మెగాస్టార్ చిరంజీవి, బాలయ్యల తొలినాళ్ళ వరకూ ప్రభాకర్ రెడ్డి అంటే.. తెలియని తెలుగు ప్రేక్షకులు లేరంటే అతిశయోక్తి కాదు. సూర్యాపేట జిల్లా తుంగతుర్తిలో పుట్టిపెరిగిన ప్రభాకర్ గారు.. తన 62 ఏళ్ళ వయసు(1997)లో కన్నుమూశారు. వ్యక్తిగతంగా వైద్యులు అయినటువంటి ఆయన.. తన సినీ కెరీర్ కూడా వైద్యుడిగా ప్రారంభించడం విశేషం. ఇక చివరగా 1990లో ప్రభాకర్ గారు చిన్నకోడలు అనే సినిమాలో కనిపించారు. ఆ సినిమాకు గానూ ఆయన బెస్ట్ సపోర్టింగ్ యాక్టర్ గా నంది అవార్డు అందుకున్నారు.సినీనటుడిగా ఎన్నో బెస్ట్ పెర్ఫార్మన్స్ లు, 4 నంది అవార్డులు అందుకున్న ప్రభాకర్ రెడ్డి గారు మంచి స్టోరీ రైటర్ కూడా. గృహప్రవేశం(1980) సినిమాకు బెస్ట్ స్టోరీ రైటర్ గా నంది అవార్డు అందుకున్నారు. మొత్తంగా 472 సినిమాలలో నటించిన ప్రభాకర్ రెడ్డి.. 21 సినిమాలకు కథలను అందించారు. అయితే.. తెలుగు ఇండస్ట్రీ మద్రాస్ నుండి హైదరాబాద్ కు షిఫ్ట్ అవుతున్న రోజుల్లో ప్రభాకర్ గారు చిత్రపురి కాలనీలోని తన 10 ఎకరాల భూమిని సినీ కార్మికులకోసం ఉచితంగా రాసిచ్చేశారు. అందుకే కాలనీని ప్రభాకర్ రెడ్డి చిత్రపురి కాలనీ అని పిలుస్తుంటారు. తాజాగా ప్రభాకర్ రెడ్డి గారి రెండో కూతురు శైలజారెడ్డి సుమన్ టీవీకి ఇంటర్వ్యూలో పాల్గొన్నారు. అలాగే వారి ఇల్లును హోమ్ టూర్ గా వీడియో చేశారు. మరి ప్రభాకర్ రెడ్డి గారి హోమ్ టూర్ వీడియో చూసి మీ అభిప్రాయాలను కామెంట్స్ లో తెలియజేయండి.