సూపర్ స్టార్ మహేష్ బాబు, కీర్తి సురేష్ జంటగా నటించిన “సర్కారు వారి పాట” సినిమా ఇటీవలే ప్రపంచవ్యాప్తంగా విడుదలై బాక్సాఫీస్ వద్ద భారీ కలెక్షన్స్ రాబడుతున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాను “గీతగోవిందం” ఫేమ్ పరశురామ్ తెరకెక్కించాడు. సర్కారు వారి పాట చిత్రం మహేష్ బాబు కెరీర్ లోనే బెస్ట్ ఓపెనింగ్స్ రాబట్టిన చిత్రంగా నిలిచింది. లవ్, యాక్షన్, కామెడీ, మాస్, ఎమోషనల్ ఇలా అన్ని అంశాలను మేళవించిన ఈ సినిమా.. పక్కా కమర్షియల్ హిట్ గా థియేటర్లలో దూసుకుపోతుంది.
‘సర్కారు వారి పాట’ సినిమాలో బ్యాంకింగ్ వ్యవస్థ తీరుపై చూపిన అంశాలపై పెద్ద ఎత్తున చర్చలు జరుగుతున్నాయి. ఈ క్రమంలో బ్యాంకింగ్ వ్యవస్థపై సినిమాలో చూపినది.. వాస్తవంగా జరుగుతున్నది ఒకటేనా? కాదా? అనే అంశంపై ప్రముఖ బ్యాంకింగ్ రంగ నిపుణులు రాంబాబు, సినీ విశ్లేషకులు ప్రభు..తమ అభిప్రాయాలను సుమన్ టీవీతో పంచుకున్నారు.
ఇదీ చదవండి: సర్కారు వారి పాట కలెక్షన్ల జోరు.. రెండో రోజు మాస్ కలెక్షన్స్!
మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం SumanTV App డౌన్లోడ్ చేసుకోండి.