సోషల్ మీడియాలో ట్రెండింగ్ జోడీ ఏదైనా ఉంది అంటే అది సాయి- నైనికా జోడీ అనడంలో సందేహం లేదు. ఢీ14 సీజన్ తో వారి పెయిర్ కు మరింత క్రేజ్ పెరిగింది. ఢీ కార్యక్రమంతో మొదలైన వారి స్నేహం ఆ తర్వాత ప్రేమగా మారింది. పెద్దలు ఒప్పుకుంటే పెళ్లికి కూడా రెడీ అని చెప్పేశారు. అయితే వారి రిలేషన్ ఎలా ఉంటుంది అనే దానిపై సాయి ఓపెన్ కామెంట్స్ చేశాడు. ‘నైనికాకు కోపం ఎక్కువ ఊరికే అరిచేస్తుంది. కానీ, ఆమెలో నాకు అదే ఇష్టం. నన్ను చాలా బాగా చూసుకుంటుంది. నాకు ఆకలిగా ఉంటే వెంటనే ఏదొకటి తీసుకొచ్చి పెడుతుంది. మనం ఆకలిగా ఉన్నప్పుడు బాగా చూసుకునే వాళ్లు మనకు ఎందుకు నచ్చరు చెప్పండి’ అంటూ వారి రిలేషన్ ఎంత అందంగా ఉంటుందో సాయి చెప్పుకొచ్చాడు.