ఆదివారం సాయంత్రం ఆయన నెల్లూరులోని ఓ హోటల్‌లో ఫ్యానుకు ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నారు. ఆత్మహత్యకు ముందు ఓ సెల్ఫీ వీడియోను విడుదల చేశారు. ఆ వీడియోలో...
ప్రముఖ టాలీవుడ్ డ్యాన్స్ కొరియోగ్రాఫర్ చైతన్య మాస్టర్ మరణం చిత్ర పరిశ్రమలో పెను విషాదాన్ని నింపింది. చిన్న వయసులో ఆయన ఆత్మహత్య చేసుకుని ప్రాణాలు తీసుకోవటం అందరి హృదయాలను కలిచివేస్తోంది. చైతన్య ఆదివారం సాయంత్రం నెల్లూరులోని ఓ హోటల్‌లో ఆత్మహత్య చేసుకున్నారు. ఆత్మహత్యకు ముందు ఓ సెల్ఫీ వీడియోను విడుదల చేశారు. ఆ వీడియోలో తన చావుకు గల కారణాలను చెప్పుకొచ్చారు. చేసిన అప్పు తీర్చలేని కారణంగానే ప్రాణాలు తీసుకుంటున్నట్లు తెలిపారు. అప్పులు తీర్చలేక చైతన్య మాస్టర్ చనిపోవటం సర్వత్రా చర్చనీయాంశంగా మారింది.
చైతన్య మరణంపై కండెక్టర్ ఝాన్సీ మాట్లాడుతూ..‘‘ చైతన్య మాస్టర్ గత ఏడాది డిసెంబర్ 31న కండెక్ట్ చేసిన ఓ ప్రోగ్రామ్‌లో కొంత మంది ఆర్టిస్టులు ఆయనకు హ్యాండిచ్చారు. దీంతో ఆ కమిటీ వాళ్లు మాస్టర్‌కు రావాల్సిన అమౌంట్‌ను ఆపేశారు. దాదాపు ఆరేడు లక్షల మొత్తమది. దాని వల్ల ఒక అప్పు .. అది తీర్చడం కోసం మరో చోట అప్పు. అలా అప్పులు చేసుకుంటూ వచ్చారు. చివరకు ఆ ఒత్తిడి తట్టుకోలేకనే ఇలాంటి కఠినమైన నిర్ణయం తీసుకుని ఉంటారు’’ అని అన్నారు. ఇలా చైతన్య మాస్టర్ అప్పులపై రకరకాల ఊహాగానాలు వినిపిస్తున్నాయి. అయితే, అందరూ అనుకుంటున్నట్లుగా కాకుండా.. అసలు నిజం వేరే ఉంది.
చైతన్యం మాస్టర్ పెద్ద మొత్తంలో అప్పులు చేయటానికి బలమైన కారణమే ఉంది. ఆయన తన చెల్లెలి పెళ్లి కోసం భారీ మొత్తంలో అప్పులు చేశారు. కెరీర్‌లో పైకి రావాలన్న ఆశతో కూడా ఆయన అప్పులు చేశారు. తన కళను నమ్ముకుని పైకి ఎదగాలని చైతన్య భావించారు. ఈ నేపథ్యంలోనే డ్యాన్స్ స్కూల్‌ను ప్రారంభించారు. ఈ డ్యాన్స్ స్కూలు కోసం కూడా బాగా అప్పులు చేశారు. ఇలా కుటుంబం, కెరీర్ కోసం చేసిన అప్పులు వడ్డీలతో రెట్టింపు అయిపోయాయి. ఒక అప్పు తీర్చడానికి మరో అప్పు చేశారు. అలా గుట్టలుగా పెరిగిన అప్పులతో తీవ్ర ఒత్తిడికి గురైన ఆయన ఆత్మహత్య చేసుకోవాలని అనుకున్నారు. ఆదివారం నెల్లూరులోని ఓ హోటల్‌లో ఫ్యానుకు ఉరి వేసుకుని చనిపోయారు.
కాగా, చైతన్య మాస్టర్ ఢీ డ్యాన్స్ షో ద్వారా కొరియోగ్రాఫర్‌గా మంచి పేరు తెచ్చుకున్నారు. తనదైన మార్క్ డ్యాన్సింగ్ స్టైల్‌తో అందరి దృష్టిని ఆకర్షించారు. డ్యాన్స్ మాస్టర్‌గా ఆయనకు మంచి కెరీర్ ఉంటుందని అందరూ భావించారు. తానొకటి తలిస్తే.. దైవం ఒకటి తలుస్తుంది అన్నట్లు చైతన్య మాస్టర్ ఊహించని విధంగా ఆత్మహత్య చేసుకుని ఈ లోకాన్ని విడిచారు. అప్పుల బాధతో ఆయన ప్రాణాలు తీసుకోవటమే ఆయన సన్నిహితులను కన్నీళ్లు పెట్టిస్తోంది. మరి, అప్పుల కారణంగా ఆత్మహత్య చేసుకున్న చైతన్య మాస్టర్ ఉదంతంపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.
‘ఢీ’ అనే డ్యాన్స్ షోలో కొరియోగ్రాఫర్‌గా పనిచేసిన మాస్టర్ చైతన్య ఆత్మహత్య చేసుకున్నాడు. – Master Chaitanya, who was a choreographer in the dance show DHEE , committed suicide. #RTVnewsnetwork @mallemalatv #chaitanya #dancemaster #sucide pic.twitter.com/rnWgUXx08x
— RTV (@RTVnewsnetwork) April 30, 2023