సాధారణంగా ఒక భాషలో నటించే హీరోయిన్లకు వేరే భాషలో క్రేజ్ రావడం అనేది అరుదుగా జరుగుతుంటుంది. ఆ విధంగా మలయాళంలో ప్రేమమ్ అనే సినిమాతో అక్కడ ఎంత క్రేజ్ తెచ్చుకుందో.. అదే సినిమాతో తెలుగులో కూడా క్రేజ్ దక్కించుకున్న హీరోయిన్ సాయిపల్లవి. కొందరు హీరోయిన్లు మన భాషలో సినిమాలు చేయకపోయినా, వాళ్ళ భాషలో చేస్తుంది కదా.. అని సంతోష పడుతుంటాం. కానీ కొందరు కొందరు హీరోయిన్లు మన భాషలో ఎప్పుడెప్పుడు సినిమా చేస్తారా.. అని చేయకపోతే బాధపడుతుంటాం. అలాంటి క్రేజ్, ఆ స్థాయి అభిమానం సాయిపల్లవి సొంతం.
సాయిపల్లవి తెలుగులో ఫిదా సినిమాతో అడుగుపెట్టింది. కానీ అంతకుముందే ఆమెకు తెలుగులో మంచి ఫ్యాన్ ఉంది. ఇక ఆమె సినిమా డెబ్యూ చేశాక ఫ్యాన్ ఫాలోయింగ్ అమాంతం పెరిగిపోయింది. ప్రస్తుతం సాయిపల్లవి అంటే.. ఓ హీరోయిన్ మాత్రమే కాదు. ఆమె స్క్రీన్ మీద కనిపిస్తే ఓ ఎమోషన్ అనేంతలా అభిమానులకు దగ్గరైంది. కెరీర్ విషయంలో ఎంత కూల్ గా ఉంటుందో.. సినిమాల విషయంలో అంత సెలెక్టివ్ గా ఉంటుంది. అందుకే సాయిపల్లవి నుండి గ్లామర్ కి స్కోప్ ఉన్న సినిమాలు కాకుండా నటనకు ఆస్కారం ఉన్న సినిమాలే వస్తుంటాయి. ఆమె కూడా అలాంటి సినిమాలకే ప్రాధాన్యతనిస్తుంది.ప్రస్తుతం సాయిపల్లవి క్రేజ్.. తెలుగు, తమిళ, మలయాళ భాషల వరకే కాదు.. దేశవ్యాప్తంగా పాకింది. అయితే.. సాయిపల్లవి తెరపై కనిపించినా.. సోషల్ మీడియాలో దర్శనమిచ్చినా ఫ్యాన్స్ కి పండగే. ఆమె గురించి కొత్త విషయాలు తెలుసుకోవాలనే ఆరాటం అభిమానులందరిలోనూ కనిపిస్తుంటుంది. అలాగే సాయి తెలుగు కూడా ఎంత క్యూట్ గా మాట్లాడుతుందో చెప్పక్కర్లేదు. తాజాగా సాయిపల్లవి ఓ ఇంటర్వ్యూలో పాల్గొని.. పలు ఆసక్తికర విషయాలను షేర్ చేసుకుంది.
ఈ క్రమంలో సాయిపల్లవి మాట్లాడుతూ తన పెళ్లి ప్రస్తావన తానే లేవనెత్తింది. చూడ్డానికి తెలుగమ్మాయి లానే ఉంటావ్ అని అనగా.. ‘బేసిగ్గా ఇంట్లో బడగ మాట్లాడేటప్పుడు నాకు మధ్యలో తెలుగు వస్తుంటుంది. అప్పుడు మా నాన్నగారు ఎవరైనా తెలుగు అబ్బాయిని చూసుకొని పెళ్లి చేసుకొమ్మని అంటుంటారు’ అని చెప్పింది. అలాగే తనకు 23 ఏళ్ళ వయసులో పెళ్ళై.. 30 వచ్చేసరికి ఇద్దరు పిల్లలు ఉంటారని అనుకున్నాను.. అంటూ ఆశ్చర్యపరించింది. ప్రస్తుతం సాయిపల్లవి మాటలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. మరి సాయిపల్లవి మాటలపై మీ అభిప్రాయాలను కామెంట్స్ లో తెలియజేయండి.