సాయిపల్లవి.. తన తొలి చిత్రం ప్రేమమ్ తోనే హీరోయిన్ గా మంచి గుర్తింపు సంపాదించుకుంది. ఆ తర్వాత తెలుగు, మలయాళ, తమిళ చిత్రాల్లో నటిస్తూ స్టార్ హిరోయిన్ స్థాయిని సంపాదించుకుంది. నటి, డాన్సర్ గానే కాకుండా.. ఒక సాధారణ వ్యక్తిగా కూడా సాయి పల్లవికి ఎంతో మంది ఫ్యాన్స్ ఉన్నారు. ఎంతో సింపుల్ గా ఉండటం, బోల్డ్- ఐటమ్ సాంగ్స్ చేయనని తెగేసి చెప్పడంతో ఆమె వ్యక్తిత్వానికి ఇంకా ఎక్కువ మంది ఫ్యాన్స్ అయ్యారు. డాక్టర్ కావాలనుకుని యాక్టర్లు అయిన వారు ఎంతో మంది ఉన్నారు. సాయి పల్లవి యాక్టర్ గా నిరూపించుకుంటూనే 2016లో డాక్టర్ కూడా అయిపోయింది.
అయితే ఆమె డాక్టర్ విద్య భారతదేశంలో పూర్తి చేయలేదు. మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియాతో గుర్తింపు పొందిన జార్జియాలోని బిలిసి స్టేట్ మెడికల్ యూనివర్సిటీలో తన ఎంబీబీఎస్ పూర్తి చేసింది. అయితే ఎంబీబీఎస్ చేసే సమయంలో జార్జియాలోని యూనివర్సిటీలో సాయి పల్లవి ఓ కార్యక్రమంలో తోటి విద్యార్థితో కలిసి డాన్స్ చేసింది. అయితే సాయి పల్లవి అలా డాన్స్ చేయడం తెలుగు ప్రేక్షకులు ఎప్పడూ చూసుండరు. అందుకే అనుకుంట ప్రస్తుతం ఆ వీడియో వైరల్ గా మారింది. మరి ఆ వైరల్ వీడియో మీరూ చూసేయండి.. మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.