టాలీవుడ్ స్టార్ హీరోగా ఉన్న అల్లు అర్జున్ పుష్ప సినిమాతో ఒక్కసారిగా పాన్ ఇండియా స్టార్ అయిపోయాడు. తెలుగులో తప్ప వేరే భాషల్లో అంచనాలు లేకుండా విడుదలైన పుష్ప సినిమా.. అన్ని భాషల్లో అద్భుతమైన రెస్పాన్స్ సొంతం చేసుకుంది. ఏకంగా హిందీలో 100 కోట్ల క్లబ్ లో చేరి రికార్డు సృష్టించింది. త్వరలోనే పుష్ప 2 షూటింగ్ లో పాల్గొనబోతున్నాడు బన్నీ.
సినీ ఇండస్ట్రీలో కొన్ని కాంబినేషన్స్ ఎప్పుడు సెట్ అవుతాయా..? అనుకునే కాంబోలో అల్లు అర్జున్, డైరెక్టర్ రాజమౌళి కాంబో కూడా ఉంది. బాహుబలి సినిమాతో టాలీవుడ్ స్థాయిని, తెలుగు సినిమాని ప్రపంచస్థాయికి తీసుకెళ్లిన రాజమౌళి.. టాలీవుడ్ లో చాలామంది స్టార్ హీరోలతో సినిమాలు చేశాడు. కానీ ఇంతవరకు అల్లు అర్జున్ తో సినిమా చేయలేదు.
పుష్ప సినిమాతో పాన్ వరల్డ్ క్రేజ్ సంపాదించుకున్నాడు బన్నీ. పుష్పరాజ్ మేనరిజం దాదాపు ప్రపంచదేశాలకు పాకేసింది. సోషల్ మీడియాలో ఇప్పటికి పుష్పరాజ్ రచ్చ నడుస్తూనే ఉంది. మరోవైపు రాజమౌళి బాహుబలి సిరీస్ తర్వాత RRR సినిమాతో ప్రేక్షకులను పలకరించనున్నాడు. ఈ ఇద్దరికీ పాన్ వరల్డ్ క్రేజ్ ఉంది. అయితే.. ప్రస్తుతం బన్నీ పుష్ప 2, రాజమౌళి మహేష్ బాబుతో ఓ సినిమా చేయనున్న సంగతి తెలిసిందే.ఇప్పటికే మహేష్ సినిమాకి సంబంధించి స్క్రిప్ట్, ప్రీప్రొడక్షన్ వర్క్ కూడా మొదలుపెట్టినట్లు తెలుస్తుంది. తాజా సమాచారం ప్రకారం.. అల్లు అర్జున్ – రాజమౌళి కాంబినేషన్ లో పాన్ వరల్డ్ సినిమా రాబోతుందని ఇండస్ట్రీ వర్గాలలో టాక్ నడుస్తుంది. ఎలాగో ఇద్దరికీ పాన్ వరల్డ్ క్రేజ్ ఉంది. అదీగాక బన్నీతో సినిమా చేస్తానని పుష్ప ప్రీ-రిలీజ్ వేడుకలో కూడా రాజమౌళి క్లారిటీ ఇచ్చాడు. కాబట్టి వీరి కాంబోలో మూవీ గురించి బయటికి వార్తలు రానప్పటికీ, సినిమా కంఫర్మ్ అంటూ సినీవర్గాలు చెబుతున్నాయి.
మరి పుష్ప 2 సినిమాతో అల్లు అర్జున్ మరో మెట్టు ఎదిగే అవకాశం ఉంది. అప్పటికి పూర్తిగా పాన్ వరల్డ్ స్టార్ అయిపోతాడు. కాబట్టి అప్పుడే సినిమా అనౌన్స్ చేస్తే బెటర్ అని రాజమౌళి భావిస్తున్నట్లు వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. మరి ఈ వార్తలపై రాజమౌళి, బన్నీలే క్లారిటీ ఇవ్వాల్సిందిగా సినీ ఫ్యాన్స్ కోరుతున్నారు. చూడాలి మరి ఈ క్రేజీ కాంబోలో మూవీ రానుందేమో! ఈ కాంబినేషన్ పై మియా అభిప్రాయాలను కామెంట్స్ చేయండి.