సీనియర్ నటి మీనా రెండో పెళ్లికి సిద్ధమైందంటూ వార్తలు వస్తున్నాయి. ఇటీవలే ఆమె భర్త విద్యాసాగర్ మరణించిన విషయం తెలిసిందే. ఇప్పుడిప్పుడే ఆమె భర్తను కోల్పోయిన విషాదం నుంచి కోలుకుని మళ్ళీ ప్రొఫెషన్ పరంగా యాక్టివ్ అవుతున్నారు. ఈ క్రమంలో ఆమె కుటుంబ సభ్యులు రెండో పెళ్లి ప్రపోజల్ ని ఆమె దగ్గర ప్రస్తావిస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. అయితే మీనా విద్యాసాగర్ ని మర్చిపోలేకపోతుండడం వల్ల ఆమె రెండో పెళ్ళికి నిరాకరిస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. రెండో పెళ్లి చేసుకోవడం ఆమెకు ఇష్టం లేదని ఆమె తన కుటుంబ సభ్యులకు చెప్పినట్లు వార్తలు వస్తున్నాయి. అయితే “భర్త అవసరం నీకు లేకపోయినా.. నీ కూతురికి తండ్రి అవసరం ఉంది, అందుకే పెళ్లి చేసుకో” అంటూ కుటుంబ సభ్యులు మీనాని పెళ్లి రిక్వస్ట్ చేస్తున్నారట.
కూతురు భవిష్యత్తు కోసం ఆలోచించమని, పాప భవిష్యత్తు బాగుండాలంటే ఒక మగ తోడు ఉండాలని మీనాపై ఒత్తిడి తెస్తున్నారట. దీంతో మీనా తప్పనిసరి పరిస్థితుల్లో రెండో పెళ్లికి ఒప్పుకున్నట్లు వార్తలు వస్తున్నాయి. 2009లో మీనా విద్యాసాగర్ ని వివాహం చేసుకున్నారు. మీనా భర్త సాఫ్ట్ వేర్ ఇంజనీర్ గా పనిచేసేవారు. అయితే అనారోగ్యం కారణంగా ఈ ఏడాది జూన్ 18న కన్నుమూశారు. భర్త మరణంతో ధైర్యాన్ని కోల్పోయిన మీనా జీవితంలో రెండో పెళ్లితో వెలుగులు నింపాలని కుటుంబ సభ్యులు భావిస్తున్నారట. తమ ఫ్యామిలీ ఫ్రెండ్ అయినటువంటి వ్యక్తిని మీనాకిచ్చి పెళ్లి చేయాలని ఆలోచనలో ఉన్నారట. మీనా కూడా తన కూతురి భవిష్యత్తు గురించి ఆలోచించి ఫ్యామిలీ ఫ్రెండ్ ని పెళ్లి చేసుకునేందుకు సిద్ధమైనట్లు కోలీవుడ్ లో ప్రచారం జరుగుతుంది. మరి ఇందులో నిజమెంత అనేది తెలియదు గానీ.. మీనా రెండో పెళ్లి చేసుకుని భర్తను పొందడం కంటే కూడా తన కూతురికి ఒక తండ్రిని పరిచయం చేయాల్సిన అవసరం చాలా ఉందని ఆమె అభిమానులు అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు.