భారీ తారాగణంతో.. భారీ బడ్జెట్‌తో.. ఎన్నో అంచనాల మధ్య విడుదలైన RRR చిత్రం అదే రేంజ్ సక్సెస్ సాధించింది. పాన్ ఇండియా మూవీగా వచ్చిన ఈ చిత్రంపై దేశ వ్యాప్తంగా ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి. సినిమాలో రామ్ చరణ్, జూనియర్ ఎన్టీఆర్ నటనపై ప్రశంసలు కురిపిస్తున్నారు. వీరిద్దరితో పాటు సినిమాలో చేసిన ప్రతి ఒక్కరిని ప్రశంసిస్తున్నారు. ముఖ్యంగా మల్లి పాత్రకు జనాలు ఫిదా అయ్యారు. సినిమాకు మూలాధారం ఈ పాత్రనే. గిరిజన బిడ్డైన మల్లిని బ్రిటిష్ దొరసాని తీసుకుని వెళ్లడంతో సినిమా ప్రారంభమవుతుంది. ఆ చిన్నారిని తీసుకువచ్చే అంశంతో కథ ముందుకు సాగుతుంది.
ఇది కూడా చదవండి: థియేటర్ లో RRR క్రేజ్.. నాటు నాటు పాటకు తాత చిందులు.. వీడియో వైరల్!
మల్లి నటన ప్రతి ఒక్కరిని ఆకట్టుకుంది. ఇక ఈ చిత్రంలో ‘నన్ను ఈడ ఇడిసిపోకన్న.. అమ్మ యాదికొస్తాంది’ అంటూ మల్లీ చెప్పే డైలాగ్ ఎంతగానో మెప్పించింది. ఈ క్రమంలో ప్రస్తుతం నెటిజనులు మల్లి పాత్ర పోషించిన ఈ చిన్నారి ఎవరా అని తెలుసుకునే ప్రయత్నంలో ఉన్నారు. తన వివరాలు ఇలా ఉన్నాయి. మల్లి పాత్ర పోషించిన ఆ చైల్డ్ ఆర్టిస్ట్ పేరు ట్వింకిల్ శర్మ.
ఇది కూడా చదవండి: నాలుగో రోజు అదే జోరు.. తొక్కుకుంటూ పోతున్న RRR!
ఈ చిన్నారిది ఛండీగర్. డాన్స్ ఇండియా డాన్స్ రియాలిటీ షోతో గుర్తింపు పొందిన ఆ అమ్మాయి చాలా టీవీ యాడ్స్‌లో నటించింది. ఫ్లిప్ కార్ట్ యాడ్‌లో ఈమెను చూసిన రాజమౌళి ఆడిషన్‌కు పిలిపించి మల్లి పాత్రకు సెలక్ట్ చేశారట. సినిమాలో ఈ చిన్నారి నటనపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.