కరోనా మళ్లీ తన పంజా విసురుతున్న విషయం తెలిసిందే. ప్రపంచ వ్యాప్తంగా కేసుల్లో ఒక్కసారిగా పెరుగుదల కనిపిస్తోంది. ఇప్పటికే ఐటీ రంగం వర్క్ ఫ్రమ్ ఆఫీస్ నిర్ణయాన్ని వెనక్కి తీసుకుంది. మళ్లీ వర్క్ ఫ్రమ్ హోమ్ కొనసాగించనున్నట్లు వెల్లడించింది. సినిమా రంగంపై కూడా కరోనా ఎఫెక్ట్ బాగానే పడుతోంది. ఇప్పటికే భారీ ప్రాజెక్టులన్నీ సంక్రాంతి బరి నుంచి తప్పుకున్నాయి. రిలీజ్ ల విషయం పక్కన పెడితే ఇప్పుడు షూటింగ్లు కూడా క్యాన్సిల్ అవుతున్నాయి. ఆ ఎఫెక్ట్ రౌడీ హీరో విజయ్ దేవరకొండ సినిమాపై కాస్త ఎర్లీగానే పడింది.
Unleashed!
Thank you for the 🤍
Expected, but still relieved 😅https://t.co/nJoyeDmZtu pic.twitter.com/pZQb0zegzj— Vijay Deverakonda (@TheDeverakonda) December 31, 2021
విజయ్ దేవరకొండ మొదటి పాన్ ఇండియా సినిమా లైగర్ కు కరోనా కష్టాలు తప్పేలా లేవు. ఆగస్టు 25న విడుదల చేయనున్నట్లు చిత్రబృందం ప్రకటించింది. కానీ, ఇప్పుడే షూట్ క్యాన్సిల్ అవడం అంటే.. ముందు ముందు పట్టాలెక్కే పరిస్థితి ఉండదని టాక్ వినిపిస్తోంది. ఇవన్నీ పక్కన పెడితే రౌడీ బాయ్ మాత్రం ఇంట్లో చిల్ అవుతున్నాడు. ‘షూట్స్ క్యాన్సిల్ అయ్యాయి. ఇంట్లో చిల్ అవుతున్నా’ అంటూ తన పెట్ డాగ్ తో ఉన్న ఫొటోని ట్వీట్ చేశాడు. రౌడీ బాయ్ ఏం చేసినా వైరల్ అవ్వాల్సిందేగా మరి. ఈసారి టాలీవుడ్ పై కరోనా ఎఫెక్ట్ ఎలా ఉండబోతోంది? మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.
Apparently its another wave Storm.
Shoots cancelled. Back to us just chilling at home.. pic.twitter.com/mnJ2w1aGWy
— Vijay Deverakonda (@TheDeverakonda) January 7, 2022