తెలుగు బుల్లితెరపై నవ్వులకి కేరాఫ్ అంటే జబర్దస్త్ షో అనే చెప్పుకోవాలి. జబర్దస్త్, ఎక్స్ ట్రా జబర్దస్త్ లో కలిపి సుమారు 50 మంది వరకు కమెడియన్స్, ఆర్టిస్ట్స్ ప్రేక్షకులను నవ్వించాడనికి కష్టపడుతూ ఉంటారు. ఇందుకోసం స్క్రిప్ట్ లో భాగంగా వారిలో వాళ్ళు తిట్టుకుంటారు, వారిలో వారు కొట్టుకొంటూ ఉంటారు. ఒకరి మీద ఒకరు పంచ్ లు వేసుకుంటూ మనల్ని నవ్విస్తుంటారు. అయితే.., ఇంత సక్సెస్ సాధించినా.., జబర్దస్త్ ఆర్టిస్ట్ లకి అక్కడక్కడ అవమానాలు ఎదురవుతూనే ఉన్నాయి. కానీ.., ఇవన్నీ బయట వ్యక్తుల ద్వారా ఎదురయ్యే అవమానాలు. కానీ.., జబర్దస్త్ కి మొదటి నుండి జడ్జ్ గా ఉంటున్న రోజానే ఇప్పుడు ఓ జబర్దస్త్ ఆర్టిస్ట్ ని స్టేజ్ పై అవమానించడం అందరికీ షాక్ కలిగిస్తోంది.
ఈ మధ్య కాలంలో జబర్దస్త్ లో బాగా పాపులర్ అయిన కమెడియన్ ఎవరంటే ఇమాన్యుయేల్ పేరే వినిపిస్తోంది. వర్షతో ఇమాన్యుయేల్ నడిపిన లవ్ ట్రాక్ సూపర్ హిట్ అవ్వడంతో అతనికి తక్కువ సమయంలోనే ఇంత పేరు వచ్చింది. దీంతో… ఇమ్మూ ఇప్పుడిప్పుడే స్టార్ గా ఎదుగుతున్నాడు. అయితే.., తాజాగా విడుదలైన జబర్దస్త్ ప్రోమోలో రోజా.. ఇమాన్యుయేల్ పరువు తీసేసింది.
తాజాగా రిలీజ్ అయిన ప్రోమోలో ఇమాన్యుయేల్‌ను ఇమిటేట్ చేస్తూ.. నూకరాజు అతడి పరువు తీసేశాడు. దీనికి బుల్లెట్ భాస్కర్ కూడా తోడయ్యాడు. నేను కూడా వర్షతో ఆడుకుంటాను.., ఎక్కువ ఫేమస్ అవుతాను అని భాస్కర్ అనడం.., ఆ వెంటనే రోజా ఇమాన్యుయేల్‌ను ఉద్దేశించి.. ఎవడో బొగడ గాడు అయ్యాడు. నువ్వు అవుతావా? అంటూ కామెంట్ చేయడం జరిగిపోయింది. రోజా కామెంట్స్ తో ఇమాన్యుయేల్ కూడా స్టేజ్ మీదే షాక్ కి గురి అయ్యాడు. ఇప్పుడిప్పుడే ఎదుగుతున్న ఇమాన్యుయేల్ ని రోజా లాంటి సీనియర్ ఆర్టిస్ట్ ఇలా కామెంట్స్ చేయడంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియచేయండి.