‘కాంతార’.. ఎలాంటి అంచనాలు లేకుండా చిన్న సినిమాగా విడుదలై అనేక రికార్డులు బద్దలు కొట్టిన సినిమా. ఇక ఈ మూవీలో హీరోగా నటించి, దర్శకత్వం వహించిన రిషబ్ శెట్టి పాన్ ఇండియా స్టార్ గా మారిపోయారు. కాంతార మూవీలో రిషబ్ శెట్టి నటనకు విమర్శకుల నుంచి ప్రశంసలు లభించాయి. ఇక ఈ సినిమాకు ప్రేక్షకులు బ్రహ్మరథం పట్టారు. అన్ని ఇండస్ట్రీలోని బాక్సాఫీస్ వద్ద కాంతార కలెక్షన్ల సునామీ సృష్టింస్తోంది. ఈ సినిమా విడుదలై వారాలు గడుస్తున్న థియేటర్లకు ప్రేక్షకులు క్యూ కడుతున్నారు. ఇంత క్రేజ్ సంపాదించిన కాంతార హీరో రిషబ్ శెట్టి గురించి ఓ ఆసక్తికరమైన విషయం బయటకి వచ్చింది. రిషబ్ శెట్టి ఏడాది క్రితం ఓ సినిమాలో ఫ్రీగా నటించాడు. ఇంకా ఆసక్తికరమైన విషయం ఏమిటంటే రిషబ్ శెట్టి నటించినది కూడా తెలుగు మూవీలోనే. మరి.. ఆ విశేషాలేంటో ఇప్పుడు తెలుసుకుందాం..
కాంతార సినిమాతో రిషబ్ శెట్టి వెలుగులోకి వచ్చాడు. కానీ ఆ సినిమా కంటే ముందే తెలుగులో ఓ సినిమాలో రిషబ్ నటించాడు. అయితే అప్పటి ఈ స్థాయిలో పాపులర్ కాకపోవడంతో అతడిని ఎవరూ గుర్తించలేదు. ఆ సినిమాలో రిషబ్ శెట్టి పాత్ర చాలా పరిమితం. కేవలం రెండు నిమిషాలు మాత్రమే తెరపై కనిపిస్తాడు. అయితే అదేమి కేజీఎప్ లాంటి సినిమా కాదు, ఎవరో స్టార్ హీరో సినిమా అంతకన్నా కాదు. ఇంతకు ఆ సినిమా ఏంటంటే ‘మిషన్ ఇంపాజిబుల్’. ఈ మూవీలో రిషబ్ శెట్టి ఓ దొంగ పాత్రలో నటించాడు. పంజాబీ బ్యూటీ తాప్సీ కూడా ఈ మూవీలో ఓ కీలక పాత్రలో నటించింది.
‘ఏజెంట్ సాయి శ్రీనివాస్ ఆత్రేయ’ సినిమాతో మంచి గుర్తింపు తెచ్చుకున్న స్వరూప్ ఈ సినిమాను తెరకెక్కించాడు. బాక్సాఫీస్ వద్ద ఈ సినిమా మంచి టాక్ సొంతం చేసుకుంది. అయితే చిన్న సినిమా కావడంతో అందులోని పాత్రలను అంతగా ఎవరు గుర్తు పట్టాలేదు. ఇక సినిమాలో ముగ్గురు పిల్లలు ముంబై వెళ్తున్నాము అనుకుని పొరపాటున బెంగళూరు వెళ్తారు. ఇక అక్కడ వాళ్లు ఎదుర్కొన్న సమస్యలు, వాటిని ఎలా అధికమించారు అనే విషయంతో స్వరూప్ కథ రాసుకొచ్చారు. ఇందులో ఖలీల్ అనే దొంగ పాత్రలో కాంతార హీరో రిషబ్ శెట్టి కనిపించాడు. ‘ఏజెంట్ సాయి శ్రీనివాస్ ఆత్రేయ’ సినిమాను చూసిన రిషబ్ శెట్టి.. స్వరూప్ ను అభినందించాడు. ఇక ఆ తర్వాత నుంచి ఇద్దరి మధ్య మంచి స్నేహం ఏర్పడింది.
వారి మధ్య ఉన్న స్నేహం కారణంగా ఆ ఖలీల్ పాత్ర కోసం అడగ్గానే.. నటించేందుకు రిషబ్ శెట్టి ఒప్పుకున్నాడట. అంతే కాక స్వరూప్‌తో ఉన్న స్నేహం కారణంగా ఆ సినిమాకి కనీసం ఒక్క రూపాయి కూడా రిషబ్ శెట్టి తీసుకోలేదు. ఇండస్ట్రీలోని ఫ్రెండ్స్ కోసం వేరే సినిమాల్లో కూడా బేషజం లేకుండా యాక్ట్ చేయడం రిషబ్ శెట్టి స్టైల్. అందుకు ఉదాహరణే దర్శకుడు స్వరూప్ సినిమాలో ఒక్కరూపాయి తీసుకోండా నటించడం.