Best Telugu Web Series in 2022: సంవత్సరం దాదాపుగా ముగిసింది. ఇంకా కొన్ని గంటల్లో 2023 సంవత్సరంలోకి అడుగుపెట్టబోతున్నాం. అందరూ ఈ ఏడాది ఎలా జరిగింది, సంవత్సరం మొత్తం గుర్తుంచుకునే విషయాలు ఏంటి అని రౌండప్ చేస్తుంటారు. అలాగే మరి ఎంటర్మైనెంట్ లో కూడా 2022 రౌండప్ చేయాలిగా. అలా 2022లో వచ్చిన బెస్ట్ తెలుగు వెబ్ సిరీస్ లు ఏంటో ఓసారి చూద్దాం. ఈ లిస్టులో ఉన్న వెబ్ సిరీస్ లను మీరు చూడకపోతే ఈ 31 రాత్రి పార్టీ టైమ్ లో చూసేలా ప్లాన్ చేసుకోండి. మరి.. ఆ బెస్ట్ వెబ్ సిరీస్ లు ఏంటో చూద్దాం..
ఈ రెక్కీ అనే క్రైమ్ థ్రిల్లర్ జీ5 ప్లాట్ ఫామ్ లో స్ట్రీమ్ అవుతోంది. సాయిరాం, శివబాలాజి, ధన్య బాలకృష్ణ, శరణ్య ప్రదీప్ వంటి వారు కీలక పాత్రలు పోషించారు. ఈ వెబ్ సిరీస్ కి పోలూరు కృష్ణ దర్శకత్వం వహించాడు. దీనిలో మొత్తం 7 ఎపిసోడ్లు ఉన్నాయి. జూన్ 17, 2022న ఈ వెబ్ సిరీస్ జీ5లో రిలీజ్ అయ్యింది.
ఈ వెబ్ సిరీస్ ని తెలుగు మనీ హెయిస్ట్ అని చెప్పొచ్చు. ఈ క్రైమ్ థ్రిల్లర్ డిస్నీ ప్లస్ హాట్ స్టార్ ప్లాట్ ఫామ్ లో స్ట్రీమ్ అవుతోంది. చాలాకాలం తర్వాత నందమూరి తారకరత్న ఈ వెబ్ సిరీస్ తో ఎంట్రీ ఇచ్చాడు. మధు షాలిని, ప్రీతి అస్రాని, రవి వర్మ, వినోద్ కుమార్, అజయ్ వంటివారు ముఖ్య పాత్రల్లో నటించారు. ఒక జైలులో ఉన్న ఖైదీ పథకం ప్రకారం బ్యాంకులను చోరీ చేసేందుకు పథకం రచిస్తాడు. 9 గంటల్లో దొంగతనం పూర్తి చేసుకుని రావడమే స్టోరీ.
హాట్ స్టార్ ఒరిజినల్స్ పరంపర వెబ్ సిరీస్ ఎంతో మంచి విజయం సాధించింది. తర్వాత జులై 2022లో సీజన్ 2 కూడా విడుదల చేశారు. పరంపర సీజన్ 1కు ఎంత రెస్పాన్స్ వచ్చిందో.. సీజన్ 2కి కూడా అంతే మంచి రెస్పాన్స్ వచ్చింది. ఒక పొలిటికల్ బేస్డ్ క్రైమ్ డ్రామాగా దీనిని చిత్రీకరించారు. జగపతిబాబు, శరత్ కుమార్, నవీన్ చంద్ర వంటి వారు లీడ్ రోల్స్ నటించారు.
2022లో విడుదలైన బెస్ట్ వెబ్ సిరీస్ లలో వదంతి కూడా ఒకటి. ఇది నిజానికి ఇది తమిళ్ వెబ్ సిరీస్ కానీ తెలుగులో కూడా అందుబాటులో ఉంది. ప్రముఖ డైరెక్టర్, నటుడు ఎస్ జే సూర్య ఇందులో లీడ్ రోల్ ప్లే చేశాడు. తెలుగు ప్రేక్షకులను అలరించిన లయ కూడా ఈ వెబ్ సిరీస్ లో ముఖ్య పాత్ర పోషించింది. ఒక అమ్మాయి హత్య కేసును ఛేదించడమే ఈ కథ. దీనిలో మొత్తం 8 ఎపిసోడ్లు ఉన్నాయి. ఇది అమెజాన్ ప్రైమ్ వీడియోలో అందుబాటులో ఉంది.
సుజల్ కూడా ఒక తమిళ్ వెబ్ సిరీస్. ఇది కూడా అమెజాన్ ప్రైమ్ వీడియోలో తెలుగులో అందుబాటులో ఉంది. ఇది ఒక క్రైమ్ థ్రిల్లర్. కతీర్, ఐశ్వర్య రాజేశ్ ముఖ్య పాత్రల్లో నటించారు. జూన్ 17న ఈ వెబ్ సిరీస్ రిలీజ్ అయ్యింది. మొత్తం ఇందులో 8 ఎపిసోడ్లు ఉంటాయి. తెలుగు డబ్బింగ్ కూడా ఎంతో అర్థవంతంగా ఉంటుంది. ఐశ్వర్య రాజేశ్, కతీర్ నటన ఆకట్టుకుంటుంది. ప్రతి ఎపిసోడ్ ఎంతో ఉత్కంఠతో సాగుతుంది.
ఆన్యాస్ ట్యుటోరియల్ అనేది ఒక హార్రర్ వెబ్ సిరీస్. ఇది ఆహాలో స్ట్రీమింగ్ అవుతోంది. నివేథిత సతీశ్, రెజీనా కసాండ్రా ప్రధాన పాత్రల్లో నటిస్తారు. కరోనా వచ్చిన తర్వాత క్వారంటైన్, లాక్ డాన్ సమయంలో జరిగిన ఒక స్టోరీగా దీనిని చిత్రీకరించారు. అక్కాచెల్లెళ్ల బంధం, వారు చిన్నప్పుడు అనుభవించిన విచిత్ర పరిస్థితులు, ఒక దెయ్యం వారి జీవితాన్ని ఎలా మార్చింది అనేది కథ.
మోడ్రన్ లవ్ హైదరాబాద్ అనే వెబ్ సిరీస్ ఒక డ్రామా, రొమాన్స్ జానర్లను టచ్ చేస్తుంది. భారతదేశంలో లాక్ డౌన్ విధించిన సమయంలో జరిగిన కొందరి జీవితాలను, వారు ఎదుర్కొన్న పరిస్థితులను కళ్లకి కట్టినట్లు చూపిస్తారు. ఇందులో అభిజిత్, నిత్యా మేనన్, ఆది పినిశెట్టి, రీతూ వర్మ, సుహాసిని వంటి వారు ముఖ్య పాత్రలు పోషించారు. మొత్తం 6 ఎపిసోడ్లుగా ఈ వెబ్ సిరీస్ స్ట్రీమింగ్ అవుతోంది.
జీ5లో స్ట్రీమింగ్ అవుతున్న ఈ వెబ్ సిరీస్ కి ఎంతో గొప్ప ఫ్యాన్ బేస్ ఉంది. లూజర్ 1 బాగా సక్సెస్ అయిన తర్వాత వచ్చిందే ఈ లూజర్ 2 వెబ్ సిరీస్.ఈ స్పోర్ట్స్ డ్రామా ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంది. ఈ వెబ్ సిరీస్ ని అభిలాష్ రెడ్డి, శ్రావణ్ మాదల కలిసి రచించి, దర్శకత్వం వహించారు. ప్రియదర్శి, కల్పిక,శశాంక్ వంటివారు ముఖ్య పాత్రలు పోషించారు. స్పోర్ట్స్ డ్రామాల్లో ఇది కూడా ది బెస్ట్ అని విమర్శకుల మన్ననలు పొందింది.
తెలుగులో వచ్చిన మరో అద్భుతమైన వెబ్ సిరీస్ మీట్ క్యూట్. ఇది సోనీ లివ్ లో నవంబర్ 25 నుంచి స్ట్రీమ్ అవుతోంది. దీనిలో సత్యరాజ్, అదా శర్మ, వర్ష బొల్లమ్మా, ఆకాంక్ష సింగ్, అశ్విన్ కుమార్ వంటి వారు ప్రధాన పాత్రలు పోషించారు. ఇందులో మొత్తం 5 ఎపిసోడ్లు ఉన్నాయి. దీప్తీ గంటా ఈ వెబ్ సిరీస్ ని రచించి, దర్శకత్వం వహించింది. ఈ సిరీస్ కు మంచి రెస్పాన్స్ వచ్చింది.