తారకరత్న ప్రస్తుతం బెంగళూరు నారాయణ హృదయాలయ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న సంగతి తెలిసిందే. తారకరత్న కోసం వైద్యులు అహర్నిశలూ పని చేస్తున్నారు. అత్యుత్తమ చికిత్స అందజేస్తున్నారు. అయినప్పటికీ కుటుంబంలో కాస్త భయం అనేది ఉండడం సహజం. తారకరత్న ఆరోగ్య పరిస్థితి మెరుగ్గానే ఉందని చెప్పినప్పటికీ.. కొంత ఆందోళన అయితే అటు డాక్టర్స్ లోనూ.. ఇటు కుటుంబ సభ్యుల్లోనూ నెలకొంది. ఇటువంటి పరిస్థితుల్లో సాధారణంగా వేడుకలకు దూరంగా ఉంటారు. కానీ కళ్యాణ్ రామ్ నటించిన అమిగోస్ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ కు కళ్యాణ్ రామ్, ఎన్టీఆర్ వెళ్లాల్సి వచ్చింది. విడుదల తేదీ దగ్గర పడుతోంది.
ఫిబ్రవరి 10న విడుదల అని ఎప్పుడో నిర్ణయించారు. తారకరత్నకు ఇలా అవుతుందని ఎవరూ ఊహించి ఉండరు. బోలెడంత ఖర్చు పెట్టి సినిమా తీశారు. తమ వల్ల నిర్మాతలకు నష్టం రాకూడదని అంత బాధలోనూ ఈవెంట్ కి వచ్చారు. అయితే ఈ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో తారకరత్న గురించి ఎన్టీఆర్ ఎందుకు మాట్లాడలేదన్న చర్చ నడుస్తోంది. ఒక్క మాట కూడా తారకరత్న గురించి మాట్లాడలేదని.. ఆయన హెల్త్ కి సంబంధించిన అప్డేట్ ఇచ్చి ఉంటే బాగుండేదన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. బెంగళూరు వెళ్లి తారకరత్న ఆరోగ్యం గురించి ఆరాలు తీసి.. డాక్టర్లతో మాట్లాడి ప్రతి క్షణం పర్యవేక్షించిన నందమూరి బ్రదర్స్.. ఇప్పుడు ఇంత పెద్ద ఈవెంట్ లో మాట్లాడకపోవడంపై కొంతమంది పెదవి విరుస్తున్నారు.
అయితే ఎన్టీఆర్ ఈ విషయం గురించి మాట్లాడకపోవడానికి వేరే కారణం ఉందన్న టాక్ నడుస్తోంది. పబ్లిక్ ఈవెంట్ పెట్టిన పర్పస్ వేరు. అది పూర్తిగా సినిమాకు సంబంధించిన ఈవెంట్ మాత్రమే. సినిమా మూడ్ తో అక్కడకు ఫ్యాన్స్ వస్తారు. ఇటువంటి సంతోష సమయంలో తమ కుటుంబం గురించో, వ్యక్తిగత విషయాల గురించో మాట్లాడి అక్కడున్న వారి మూడ్ ని డిస్టర్బ్ చేయడం ఇష్టం లేకనే ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్ లు దీని గురించి మాట్లాడలేదన్న ప్రచారం జరుగుతోంది. ప్రీ రిలీజ్ ఈవెంట్ అనేది పబ్లిక్ ఈవెంట్.
పబ్లిక్ ఈవెంట్ లో తారకరత్న గురించి మాట్లాడి.. దానిపై మళ్ళీ చర్చ వచ్చేలా చేయడం.. ఇవన్నీ ఇష్టం లేకనే ఆయన విషయంలో కామ్ గా ఉన్నట్లు తెలుస్తోంది. మామూలుగా తారకరత్న గురించి మాట్లాడి సింపతీ క్రియేట్ చేసుకునే అవకాశం ఉంది. ఒకవేళ మాట్లాడినా సింపతీ క్రియేట్ అవుతుంది. కానీ నందమూరి బ్రదర్స్ అలా చేయలేదు. ఈవెంట్ అయ్యేవరకూ లోపల ఎంత బాధ ఉన్నా.. సినిమా మూడ్ ని మెయింటెయిన్ చేస్తూ వచ్చారన్న కామెంట్స్ అయితే వినిపిస్తున్నాయి. మరి ఈ విషయంలో తారక్, కళ్యాణ్ రామ్ లది ఒప్పేనా? మీ అభిప్రాయమేమిటో కామెంట్ చేయండి.