KGF ఇప్పుడు దేశవ్యాప్తంగా ఎక్కడ విన్నా ఇదే పేరు వినిపిస్తుంది. సినిమా విడుదలై వారం రోజులు కావొస్తున్న కేజీఎఫ్ క్రేజ్ మాత్రం తగ్గడం లేదు. అన్ని ఇండస్ట్రీల నుచి యష్, ప్రశాంత్ నీల్‌పై ప్రశంసలు కురిపిస్తున్నారు. ఇక బాక్సాఫీస్ వద్ద రికార్డు స్థాయి కలెక్షన్లతో దూసుకుపోతుంది. అయితే ఈ సినిమాలో గనిలో కార్మికులను హింసించే సన్నివేశాలు.. నిజంగానే చోటు చేసుకున్నాయని.. వాటిని ప్రశాంత్ నీల్ కళ్లకు కట్టినట్లు తెర మీద చూపించారని.. అలానే నెహ్రూ ప్రధానిగా ఉన్న సమయంలో కేజీఎఫ్ మైనింగ్ వరల్డ్ బ్యాంక్ దగ్గర తాకట్టు పెట్టారనే వాదనలు తెర మీదకు వచ్చాయి. అయితే ఇవి వాస్తవమేనా.. నిజంగానే ఇలా జరిగింది.. ఇలాంటి ఆసక్తికరమైన విషయాలపై క్లారిటీ ఇచ్చారు KGF మైనింగ్ ఇంజనీర్ కేఎస్ రావు. ఆ వివరాలు ఆయన మాటల్లోనే..
ఇది కూడా చదవండి: KGF-2 క్లైమ్యాక్స్ లో షాకింగ్ ట్విస్ట్! రాకీ భాయ్ బతికే ఉన్నాడా?
KGFని తాకట్టు పెట్టారా..‘‘KGF ద్వారా మాకు బంగారం వస్తోంది అని చెప్పి ఉండొచ్చు కానీ.. KGF తాకట్టు పెట్టడం కరెక్ట్ కాదు. ఒకవేళ అలా పెట్టి ఉంటే.. రిజర్వ్ బ్యాంక్ నుంచి సూపర్ వైజ్ చేయడానికి ఎవరైనా వచ్చేవారు. నేను జాయిన్ అయ్యేటప్పటికీ ఇంగ్లీష్ వాళ్లు ఎవరూ లేరు. మేనేజ్‌మెంట్‌లో అంతా ఇండియన్స్ ఉండేవారు’’ అని కేఎస్ రావు తెలిపారు.
ఇది కూడా చదవండి: KGF-2 నటీనటుల రెమ్యూనరేషన్స్ లిస్ట్! యష్ కి ఎంతంటే?
వేల మంది చనిపోవడానికి కారణం.. ఏంటి
‘‘ఇక KGF సినిమాలో చాలా వయొలెన్స్ ఉంది. . కొన్నివేల మంది చనిపోయారు. KGF మైనింగ్ 1880లో స్టార్ట్ అయ్యి.. 2001 వరకూ కొనసాగింది. దాదాపు 121 సంవత్సరాలు మైనింగ్ జరుగుతూనే ఉంది. ఈ 121 సంవత్సరాల్లో మోడరన్ డేస్ ఎప్పుడంటే.. 1950-60 అని చెప్పొచ్చు. అంతకు ముందు అంతా క్రూరంగానే ఉండేది. చాలామంది ప్రాణాలు కోల్పోయారు’’ అని నాటి దుర్ఘటనలను గుర్తు చేసు కున్నారు.
రాళ్లు ఒత్తిడి గురై ప్రమాదాలు..‘‘KGFలో విచిత్రమైన విషయం ఏంటంటే.. రాళ్లు పేలుతుంటాయి. రాయిని మనం పేల్చడం కాదు.. వాటంతట అవి పేలుతుంటాయి. భూమిలో ఎక్కువ లోతుకు వెళ్లడం వల్ల ఒత్తిడి ఎక్కువ అయ్యి.. రాళ్లు పేలుతుంటాయి. అర్ధం అయ్యెలా చెప్పాలంటే.. బుక్స్ అన్నీ మనం ఒకేచోట కుక్కి కుక్కి పెట్టేస్తాం.. ఒక బుక్‌ని బయటకు లాగితే వెంటనే ఆ గ్యాప్‌ని మిగిలిన బుక్స్ ఫిల్ చేయడానికి కదులుతాయి. ఇది కూడా అంతే. రాళ్లు పేలడం వల్ల చాలామంది ప్రాణాలను కోల్పోయేవారు.. ఇక కాళ్లు చేతులు పోగొట్టుకున్నవాళ్లు వేలల్లో ఉన్నారు’ అంటూ ఆసక్తికరమైన విషయాలను చెప్పుకొచ్చారు రియల్ KGF మైనింగ్ ఇంజనీర్ కేఎస్ రావు. ప్రస్తుతం ఆయన వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి. దీనిపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.
ఇది కూడా చదవండి: KGF-2 విషయంలో రాజమౌళి మౌనానికి కారణం ఏమిటి..?