కేజీఎఫ్ సినిమా ఎన్ని సంచలనాలు సృష్టించిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఈ సినిమాలో నటించిన ప్రతి ఒక్కరు దేశ వ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్నారు. ఇక కేజీఎఫ్ చిత్రం ద్వారా గుర్తింపు తెచ్చుకున్న నటి ఒకరు ఆస్పత్రిలో చేరారు. ఆ వివరాలు..
ఆండ్రీ మాళవిక అవినాష్.. ఈ పేరు చెబితే.. తెలుగు వారు వెంటనే గుర్తు పట్టలేరు. కానీ కేజీఎఫ్ సినిమాలో కథను నడిపించే సీనియర్ ఉమెన్ జర్నలిస్ట్ పాత్రలో నటించిన నటి అనగానే.. టక్కున గుర్తు పడతాం. కేజీఎఫ్ చిత్రం ద్వారా తెలుగు వారికి పరిచయం అయిన ఈ నటి.. శాండల్‌వుడ్‌లో తనదైన ముద్ర వేశారు ఆండ్రీ మాళవిక అవినాష్. సినిమాల్లోనే కాకుండా సీరియల్స్‌లో కూడా నటిస్తూ గుర్తింపు పొందారు. కేజీఎఫ్ సినిమా ద్వారా పాన్ ఇండియా రేంజ్‌లో గుర్తింపు తెచ్చుకున్నారు. ఇక మాళవిక నాయర్ తన కెరీర్‌లో విభిన్నమైన కథలను ఎంచుకుని.. తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది. సినిమాలు, సీరియల్స్ మాత్రమే కాక.. రియాల్టీ షోలకు జడ్జిగా కూడా ఆమె వ్యవహరిస్తున్నారు. మాళవిక అవినాష్ లా గ్రాడ్యుయేట్ కూడా.
ఇక తాజాగా మాళవిక అవినాష్ అనోరాగ్యం బారిన పడింది. తీవ్ర అస్వస్థతకు గురై ఆస్పత్రిలో చేరింది. ఈవిషయాన్ని ఆమెనే స్వయంగా తన సోషల్ మీడియాలో షేర్ చేసింది. మరి ఇంతకు మాళవికకు ఏమైంది.. సమస్య ఏంటి అంటే.. నటి మాళవిక అవినాష్ గత కొన్నాళ్లుగా మైగ్రేన్‌తో బాధపడుతున్నారు. ఈ సమస్య కారణంగా.. మాళవిక మొహం మొత్తం మారిపోయింది. ముఖం మందంగా ముద్దలా గుర్తు పట్టలేనంతగా మారిపోయింది. ఈ క్రమంలో ఆస్పత్రిలో ఉండగా తీసిన ఫొటోని ఆమె సోషల్ మీడియాలో షేర్ చేయడంతో ప్రస్తుతం ఈ వార్త నెట్టింట వైరల్‌గా మారింది.
అంతేకాక ఎవరికైనా మైగ్రేన్ సమస్య ఉంటే.. వారు దాన్ని తేలికగా తీసుకోవద్దని సూచించింది. లేదంటే తనలా ఆస్పత్రిలో చేరాల్సి వస్తుంది అని చెప్పుకొచ్చింది. ఇక తాను మైగ్రేన్ సమస్య నుంచి బయటపడటం కోసం పనాడోల్, నెప్రోసిమ్‌తో పాటు సంప్రదాయ ఔషధం తీసుకున్నానని చెప్పుకొచ్చింది. అంతేకాక మైగ్రేన్ సమస్య ఉన్న వారు.. డాక్టర్‌ని సంప్రదించాల్సిందిగా సూచింది. ప్రస్తుతం మాళవిక చేసిన పోస్ట్ నెట్టింట వైరల్‌గా మారింది.
ఇక సినిమా విషయానికి వస్తే.. మాళవిక ఇప్పటివరకు 50కి పైగా చిత్రాల్లో నటించింది. 2014లో వచ్చిన మిస్టర్ అండ్ మిసెస్ రామాచారి సినిమాలో తల్లిగా కనిపించిన తర్వాత చాలా వరకు స్ట్రిక్ట్ రోల్స్ చేసింది. కేజీఎఫ్‌తో దేశవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకుంది. మరోవైపు తన అనారోగ్యం గురించి చెబుతూ.. మీకు కూడా మైగ్రేన్లు ఉంటే నిర్లక్ష్యం చేయకండి. త్వరగా వెళ్లి వైద్యుడిని సంప్రదించండి అని మాళవిక తన అభిమానులను కోరింది. మాళవిక త్వరగా కోలుకోవాలని కోరుకుంటున్నారు అభిమానులు.