టాలీవుడ్ లో ఎంతో మంది బ్యాగ్రౌండ్ తో స్టార్ హీరోలు అయిన వాళ్లున్నారు. కానీ, మాస్ మహారాజ రవితేజ మాత్రం కష్టపడే వాడికి ఇండస్ట్రీలో అవకాశాలు తప్పకుండా ఉంటాయని నిరూపించాడు. ఒక క్యారెక్టర్ ఆర్టిస్ట్ నుంచి స్వయంకృషిని నమ్ముకుని ఇప్పుడు స్టార్ హీరోగా ఎదిగాడు. ఇప్పుడు వరుస సినిమాలతో ఎంతో బిజీగా ఉన్న హీరో రవితేజ. రామారావు ఆన్ డ్యూటీ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో ఉండగా.. రావణాసుర, ధమాకా, టైగర్ నాగేశ్వరరావు సినిమాలు ప్రస్తుతం సెట్స్ మీదున్నాయి. అయితే ప్రస్తుతం రవితేజ కుమారుడు హీరోగా ఎంట్రీ ఇవ్వబోతున్నట్లు జోరుగా ప్రచారాలు జరుగుతున్నాయి. అయితే అందుకు సంబంధించిన డైరెక్టర్ పేరు కూడా లీక్ అయ్యింది.
ఇదీ చదవండి: ‘ఆచార్య’ ఫస్ట్ రివ్యూ వచ్చేసింది.. ఫ్యాన్స్ కు పూనకాలే!
రవితేజకు మహాధన్ అనే కుమారుడు ఉన్న విషయం అందరికీ తెలిసిందే. రాజా ది గ్రేట్ సినిమాలో రవితేజ చిన్నప్పటి క్యారెక్టర్ లో మహాధన్ కనిపించి అందరినీ అలరించాడు. అయితే మహాధన్ సినిమా ఎంట్రీపై రవితేజను గతంలో అడగగా.. అతని స్టడీస్ అయిపోయిన తర్వాత హీరోగా ఇంట్రడ్యూస్ చేస్తానని ఎప్పుడో చెప్పాడు. అయితే ఇప్పుడు కరెక్ట్ కథ రావడంతో మహాధన్ ఎంట్రీకి రవితేజ ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. మంచి యూత్ ఫుల్ క్యారెక్టర్ తో హీరోగా ఎంట్రీ ఇవ్వనున్నట్లు ఫిలిం వర్గాల్లో టాక్ జోరుగా నడుస్తోంది.
మోస్ట్ సక్సెస్ ఫుల్ డైరెక్టర్ల లిస్టులో ఉండే అనీల్ రావిపూడి రవితేజను కలిసినట్లు తెలుస్తోంది. మంచి కాలేజ్ బ్యాగ్డ్రాప్లో కథలో మహాధన్ హీరోగా ఎంట్రీ ఇస్తే బావుంటుందని అనీల్ రావిపూడి కోరినట్లు చెబుతున్నారు. అందుకు రవితేజ కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు సమాచారం. అదే నిజమైతే అనీల్ రావిపూడి దర్శకత్వంలో రవితేజ కుమారుడు మహాధన్ హీరోగా ఎంట్రీ ఇవ్వబోతున్నాడనమాట. ప్రస్తుతం అనీల్ రావిపూడి విక్టరీ వెంకటేశ్- వరుణ్ తేజ్ లతో కలిసి F2కి సీక్వెన్స్ F3 తెరకెక్కించిన సగంతి తెలిసిందే. ఆ సినిమా మే 27న ప్రేక్షకుల ముందుకు రానుంది. అయితే మహాధన్ తో ఎప్పుడు సినిమా స్టార్ట్ చేస్తారు అనే దానిపై మాత్రం అధికారిక ప్రకటన ఇంకా రాలేదు. రవితేజ కుమారుడి సినిమా ఎంట్రీపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.
మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం SumanTV App డౌన్లోడ్ చేసుకోండి.