నటసింహ నందమూరి బాలకృష్ణ 60+వయసులోనూ 30+ఉత్సాహంతో పని చేస్తున్నారు. సినిమాలు, రాజకీయాలు, క్యాన్సర్ హాస్పిటల్ వ్యవహారాలు, టాక్ షో, ప్రకటనలు.. ఇలా ఫుల్ బిజీగా గడుపుతున్నారు.
నటసింహ నందమూరి బాలకృష్ణ 60+వయసులోనూ 30+ఉత్సాహంతో పని చేస్తున్నారు. సినిమాలు, రాజకీయాలు, క్యాన్సర్ హాస్పిటల్ వ్యవహారాలు, టాక్ షో, ప్రకటనలు.. ఇలా ఫుల్ బిజీగా గడుపుతున్నారు. ఇటీవలే తానా సభల్లో పాల్గొనడానికి అమెరికా వెళ్లొచ్చిన బాలయ్య.. హైదరాబాద్ వచ్చాక షూటింగ్‌లో జాయిన్ అయ్యారు. ఇప్పుడు బాలయ్య గురించిన క్రేజీ న్యూస్ ఒకటి మీడియాతో పాటు సోషల్ మీడియాలోనూ వైరల్ అవుతోంది. బాలయ్య – బ్లాక్ బస్టర్ డైరెక్టర్ అనిల్ రావిపూడిల క్రేజీ కాంబోలో తెరకెక్కుతున్న మూవీ ‘భగవంత్ కేసరి’ (I Don’t Care). కాజల్ అగర్వాల్ ఫీమేల్ లీడ్ కాగా యంగ్ టాలీవుడ్ సెన్సేషన్ శ్రీలీల, బాలయ్య కూతురిగా కనిపించనుంది. షైన్ స్క్రీన్స్ బ్యానర్ మీద సాహూ గారపాటి – హరీష్ పెద్ది నిర్మిస్తున్నారు.
బాలీవుడ్ స్టార్ అర్జున్ రాంపాల్ విలన్‌గా చేస్తున్నారు. బాలయ్య బర్త్‌డేకి రిలీజ్ చేసిన టీజర్ సినిమా అంచనాలు పెంచేసింది. తెలంగాణ యాసలో డైలాగ్స్ అదరగొట్టేశారు నటసింహ. బాచుపల్లిలో వేసిన జైలు సెట్‌లో మేజర్ సీన్స్ షూట్ చేశారు. బాలయ్య వయసు తగ్గ పాత్రలో కనిపించనున్నారు. యంగ్ ఏజ్‌లో జైలుకెళ్లి, వయసుపైబడ్డాక విడుదలై బయటకు వచ్చే క్యారెక్టర్ అని తెలుస్తుంది. అందుకు తగ్గట్టే బాలయ్య గెటప్, కాస్ట్యూమ్స్ అన్నీ సరికొత్తగా ఉన్నాయి. ఆయన మార్క్ సీరియస్ యాక్షన్‌తో పాటు తన స్టైల్ ఎంటర్‌టైన్‌మెంట్ కూడా ఉంటుందని క్లారిటీ ఇచ్చాడు అనిల్.
ఇక లేటెస్ట్ బజ్ ఏంటంటే.. ఈ సినిమాలో పాటలకు తక్కువ స్కోప్ ఉంటుందట కానీ, ఉన్న వాటితోనే ఫ్యాన్స్‌ని ఖుషీ చెయ్యడానికి ఆ సాంగ్స్‌ని భారీగా డిజైన్ చేస్తున్నారట. సరైన సాంగ్ పడాలే కానీ, కొరియోగ్రాఫర్ చేయించాలే కానీ బాలయ్య కుర్ర హీరోలకు పోటీగా అదిరిపోయే స్టెప్పులేస్తారని కొత్తగా చెప్పక్కర్లేదు. ‘లెజెండ్’, ‘అఖండ’, ‘వీర సింహా రెడ్డి’లోని పాటల్లో స్టెప్పులు కుమ్మేశారు.
అయితే ‘భగవంత్ కేసరి’ మూవీలో ఓ పాటలో బాలయ్య చేత ఏకంగా ఫ్లోర్ స్టెప్ వేయించాలనుకున్నాడట డైరెక్టర్. బాలయ్యకి తన ఆలోచన చెప్పడం, ఆయన వెంటనే ‘ఓకే, చేసేద్దాం’ అనేసి.. 10 రోజుల పాటు ప్రాక్టీస్ చేయడం కూడా జరిగిందట. ‘బాలయ్య ఫ్లోర్ మూమెంట్ వేస్తే ఎలా ఉంటుంది?, థియేటర్లు దద్దరిల్లిపోతాయ్.. జస్ట్ ఇమాజిన్’ అంటూ కామెంట్స్ చేస్తున్నారు నందమూరి ఫ్యాన్స్.