Raveena Tandon: ‘‘కేజీఎఫ్’’ సినిమా సెన్సేషనల్ హిట్ అవ్వటంతో మరోసారి నేషనల్ టాల్క్‌గా మారారు సీనియర్ హీరోయిన్ రవీనా టండన్. ‘‘ఫత్తర్ కే ఫూల్’’ అనే హిందీ సినిమాతో ఇండస్ట్రీలోకి వచ్చారామె. మొదటి సినిమాతోటే ఫిల్మ్‌ఫేర్ అవార్డును సొంతం చేసుకున్నారు. హిందీతోపాటు సౌత్‌లో కూడా సినిమాలు చేశారు. తెలుగులో ‘‘రథసారథి’’ ఆమె మొదటి సినిమా. బంగారుబుల్లోడు, ఆకాశ వీధిలో, పాండవులు పాండవులు తుమ్మెద సినిమాలు చేశారు. ఇప్పటి వరకు దాదాపు 50కిపైగా సినిమాల్లో నటించారు. పదికిపైగా టీవీషోలు కూడా చేశారు. తాజాగా, ఆమె ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ తన సినీ ఎంట్రీకి సంబంధించి పలు ఆసక్తికర విషయాలు బయటపెట్టారు. 1990 ముందు వరకు తనకు సినిమాల్లోకి రావాలన్న ఆలోచన ఎప్పుడూ లేదని అన్నారు. ఆమె మాట్లాడుతూ.. ‘‘ కాలేజీలో చదువుతున్న రోజుల్లో జెనెసిస్ పీఆర్‌లో ఇంటర్న్‌షిప్‌కు వెళ్లాను. అక్కడ యాడ్ డైరెక్టర్ ప్రహ్లాద్ కక్కర్‌కు సహాయంగా ఉండేదాన్ని.
స్టూడియో ఫ్లోర్‌లు తుడిచేదాన్ని. ఎవరైనా వాంతులు చేసుకుంటే అది కూడా శుభ్రం చేసేదాన్ని. నా ఫ్రెండ్స్, అక్కడ పనిచేసేవాళ్లు.. ‘‘నువ్వు చాలా అందంగా ఉన్నావు’’ అంటూ పొగిడేవారు. అయితే, నాలోని మోడల్‌ను గుర్తించింది మాత్రం శాంతను షీరే అనే ఫొటోగ్రాఫర్, డైరెక్టర్. ఆయనే నన్ను మోడల్‌ని చేశారు. ఆ తర్వాత సినిమా ఆఫర్లు వచ్చాయి. కానీ, నేను చేయనన్నాను. ప్రహ్లాద్ కక్కర్ సూచన మేరకు ఓ సినిమా ఒప్పుకున్నా. అదే నా మొదటి సినిమా ‘‘ఫత్తర్ కే ఫూల్’’. సినిమాల్లోకి వచ్చేవరకు నాకు యాక్టింగ్ అంటే తెలీదు. సినిమాలు చేస్తూనే యాక్టింగ్ నేర్చుకున్నా’’ అని అన్నారు. మరి, కేజీఎఫ్ సినిమాలో రవీనా నటనపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.
ఇవి కూడా చదవండి : ఆ హీరో కంట్లో పడ్డాను..! కన్నీరు పెట్టుకున్న స్టార్ హీరోయిన్!
మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం SumanTV App డౌన్లోడ్ చేసుకోండి.