సౌత్ నుంచి ఒకే ఒక్కడు అది మహేష్ బాబు.. ఏ హీరో టచ్ చేయనటువంటి రికార్డ్ ని మహేష్ తన ఖాతాలో వేసుకున్నారు. ఇంతకే ఆ రికార్డ్ ఏంటంటే?
సూపర్ స్టార్ మహేష్ బాబు.. ఈ పేరు తెలియని తెలుగు వాళ్ళు లేరు. తన తండ్రి కృష్ణ నట వారసత్వాన్ని పుణికి పుచ్చుకొని ఆయనను మించిన ఇమేజ్ ని సంపాదించిన నటుడు ప్రిన్స్ మహేష్ బాబు. బాబులకే బాబు మా మహేష్ బాబు అని కోట్లాది మంది అభిమానుల చేత పిలిపించుకునే ఏకైక తెలుగు నటుడు మహేష్ బాబు. సూపర్ స్టార్ అనే బిరుదుకి తగ్గట్టుగానే వెండి తెర మీద మహేష్ బాబు ఉంటే చాలు ఆ సినిమా కలెక్షన్ ల సునామీని సృష్టించడం ఖాయం అనే నానుడి సినీ ట్రేడ్ వర్గాల వారి నుంచి తరచు వినపడే మాట. ఈరోజు మహేష్ బాబు పుట్టిన రోజు.. ఈ పుట్టిన రోజు సందర్భంగా మహేష్ బాబు నటించిన సూపర్ హిట్ మూవీ బిజినెస్ మేన్ రీ రిలీజ్ అయ్యి ప్రపంచవ్యాప్తంగా ఆల్ షోస్ హౌస్ ఫుల్ బోర్డ్స్ తో ముందుకు దూసుకెళ్ళిపోతు తెలుగు చలన చిత్ర చరిత్రలో సరికొత్త రికార్డ్స్ ని క్రియేట్ చేసే విధంగా తన ప్రయాణాన్ని కొనసాగిస్తూ వుంది. ఇప్పుడు సరికొత్తగా మహేష్ బాబు కి సంబంధించిన రికార్డు ఒకటి బయటకు వచ్చింది..
ఇంతకీ ఆ రికార్డు ఏంటో చూద్దాం. అమెరికాలో ఇటీవలే అత్యధిక సార్లు 1 మిలియన్ డాలర్లు వసూలు సాధించిన భారతీయ సినిమాల జాబితా ఒకటి విడుదలైంది. ఆ జాబితాలో హిందీ చిత్ర సీమకి సంబంధించిన కొంతమంది హీరోలు ఉండగా దక్షిణ భారత చిత్ర పరిశ్రమకు సంబంధించి కేవలం ఒక్క హీరో మాత్రమే ఉన్నాడు. ఆ హీరో మరెవరో కాదు సూపర్ స్టార్ ప్రిన్స్ మహేష్ బాబు. అవును అమెరికాలో 1 మిలియన్ డాలర్ వసూలు సాధించిన దక్షిణ భారతదేశానికి చెందిన హీరో కేవలం మహేష్ బాబు మాత్రమే. అది కూడా ఒకసారో, రెండు సార్లో కాదు ఏకంగా 11 సార్లు మహేష్ బాబు.. 1 మిలియన్ డాలర్లని వసూలు చేసాడు.
మహేష్ బాబు ఇంతవరకు 27 సినిమాలు చేయగా.. అందులో 11 సినిమాలు 1 మిలియన్ డాలర్ల కలెక్షన్స్ ని వసూలు చేసి అమెరికన్ బాక్స్ ఆఫీస్ ని చెడుగుడు ఆడాయి. ఏ హీరోకి సాధ్యం కాని విధంగా 11 సినిమాలు అమెరికాలో ఆ స్థాయిలో వసూలు చేయడం మహేష్ బాబు కి ఓవర్ సీస్ లో ఉన్న ఫాలోయింగ్ కి నిదర్శనం అని సినీ పండితులు చెబుతున్నారు. ఇక మహేష్ బాబు పుట్టిన రోజున ఈ వార్త విన్న మహేష్ అభిమానుల ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. స్టార్ ల కే స్టార్ మా సూపర్ స్టార్ మహేష్ బాబు అంటూ సంబరాలు జరుపుకుంటున్నారు. మరి దక్షిణాదిలో ఏ హీరోకి సాధ్యం కానటువంటి రికార్డ్ ని సొంతం చేసుకున్న మహేష్ బాబుపై మీ అభిప్రాయమేమిటో కామెంట్ చేయండి.