టాలీవుడ్ హవా రోజురోజుకీ పెరుగుతూనే ఉంది. పాన్ ఇండియా రేంజ్ లో ప్రతి ఒక్కరూ మన సినిమాల గురించే మాట్లాడుకుంటున్నారు. బాలీవుడ్ మూవీస్ ని అస్సలు పట్టించుకోవట్లేదు. ఇక కరోనా తర్వాత తెలుగు ఇండస్ట్రీ బలంగా నిలబడగా.. హిందీ చిత్రసీమ మాత్రం పూర్తిగా కుదేలైపోయింది. ఏదో ఒకటి రెండు సినిమాలు తప్పించి వచ్చిన సినిమాలు వచ్చినట్లే బాక్సాఫీస్ దగ్గర బోల్తా కొట్టేస్తున్నాయి. సల్మాన్, అక్షయ్ కుమార్, రణ్ వీర్ సింగ్ లాంటి స్టార్ హీరోలున్నా సరే ప్రేక్షకులు నో చెబుతున్నారు. అదే టైంలో ‘కార్తికేయ 2’, ‘కాంతార’ లాంటి దక్షిణాది సినిమాలకు నార్త్ ఆడియెన్స్ బ్రహ్మరథం పడుతున్నారు. దీంతో బాలీవుడ్ హీరోలు కూడా మన సినిమాలపైనే కన్నేస్తున్నారు. సౌత్ మూవీస్ నే రీమేక్ చేస్తే ఓ పనైపోతుందని భావిస్తున్నారు.
ఇక వివరాల్లోకి వెళ్తే.. రీమేక్ అనేది ఎప్పటినుంచో ఉన్నదే. ఇక్కడ సినిమాలు అక్కడ, అక్కడ సినిమాలు ఇక్కడ తీయడమనేది దర్శకులకు తీయడంలో, ప్రేక్షకులకు చూడటంలో బాగా అలవాటైపోయింది. ఓటీటీ కల్చర్ బాగా పెరిగిపోయిన ఈ టైంలోనూ పలువురు హీరోలు రీమేక్ చేయడానికి ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. ఆల్రెడీ తెలుగు సినిమా రీమేక్ లో నటించిన బాలీవుడ్ స్టార్ హీరో రణ్ వీర్ సింగ్.. ఇప్పుడు రవితేజ హిట్ సినిమాపై కన్నేశాడు. ఇప్పటికే కథా చర్చలు కూడా నడిచినట్లు తెలుస్తోంది. ఆ సినిమానే ‘క్రాక్’. గతేడాది సంక్రాంతి సందర్భంగా థియేటర్లలో రిలీజైన ఈ చిత్రం.. మోస్తరు వసూళ్లు సాధించినప్పటికీ, బాక్సాఫీస్ దగ్గర హిట్ గా నిలిచింది. రవితేజ కెరీర్ కు బూస్టప్ ఇచ్చింది. ఇప్పుడు ఈ సినిమానే రణ్ వీర్ రీమేక్ చేయాలని ఫిక్స్ అయ్యాడట.
రీసెంట్ గా రణ్ వీర్ సింగ్ ని కలిసిన డైరెక్టర్ గోపీచంద్ మలినేని.. ‘క్రాక్’ రీమేక్ కు సంబంధించిన డిస్కషన్స్ జరిపారట. బాలీవుడ్ నేటివిటీకి తగ్గట్లు చాలా మార్పులు కూడా చేశారట. తెలుగులో స్టార్ హీరోలతో భారీ బడ్జెట్ సినిమాలు తీస్తున్న మైత్రీ మూవీ మేకర్స్.. హిందీలో ఈ రీమేక్ ప్రొడ్యూస్ చేయనుందని సమాచారం. ఇదిలా ఉండగా ప్రస్తుతం గోపీచంద్, నందమూరి బాలకృష్ణతో ‘వీరసింహారెడ్డి’ చేశారు. ఇది సంక్రాంతి కానుకగా జనవరి 12 నుంచి ప్రేక్షకుల్ని ఎంటర్ టైన్ చేయనుంది. ఇప్పటికే పాటలు, టీజర్.. అభిమానులకు ఫుల్ కిక్కిస్తున్నాయి. దీని హడావుడి అంతా పూర్తయిన తర్వాత ‘క్రాక్’ హిందీ రీమేక్ పై ఓ క్లారిటీ రానుంది. ఇక తాజాగా ‘సర్కస్’ మూవీతో వచ్చిన రణ్ వీర్.. ఘోరమైన డిజాస్టర్ ని అందుకున్నాడు. సరే ఇదంతా పక్కనబెడితే.. క్రాక్ రీమేక్ లో రణ్ వీర్ అని వస్తున్న వార్తలపై మీ అభిప్రాయాన్ని కామెంట్స్ లో పోస్ట్ చేయండి.
#Krack Remake by #RanveerSingh#Raviteja pic.twitter.com/r4LW0mryrz
— Skyups Media (@skyupsMedia) December 26, 2022