బాలీవుడ్ పాపులర్ ప్రేమజంట రణబీర్ కపూర్ – అలియా భట్ జంటగా నటించిన సోషియో ఫాంటసీ మూవీ బ్రహ్మాస్త్ర. ఇటీవలే బ్రహ్మాస్త్ర టీమ్ మోషన్ పోస్టర్ లాంచ్ చేసింది. అయితే.. ఈ కార్యక్రమంలో పాల్గొన్న రణబీర్ కపూర్, ప్రియురాలు అలియాభట్ ని కాసేపు ఆటపట్టించాడు. అలియాభట్ లైఫ్ లో R అనే లెటర్ చాలా స్పెషల్ అనుకుంటా. ఆ లెటర్ కి నీకు ఉన్న సంబంధం ఏంటో చెప్తావా? అని రన్బీర్ అలియాని అడిగాడు. ఆమె సిగ్గుపడుతూ.. ‘నిజమే R అనేది నా లైఫ్ లో చాలా పెద్ద విషయం. అలాగే నెం.8(రణబీర్ జెర్సీ నెంబర్) కూడా చాలా స్పెషల్’ అని రణబీర్ గురించి చెప్పకనే చెప్పింది.
ఆ తర్వాత.. ‘A లెటర్ అంటే నువ్ ఏం చెప్తావ్?’ అని అలియా రణబీర్ ని అడిగింది. వెంటనే రణబీర్ స్పందించి అలియా పేరు చెప్పకుండా.. ‘A అంటే.. అమితాబ్ బచ్చన్, డైరెక్టర్ అయాన్ ముఖర్జీ’ అంటూ ఆటపట్టించాడు. దానికి అలియా అలకతో పక్కకి వెళ్ళిపోయింది. అనంతరం మీడియా వారు.. ‘ఈ నెలలోనే RRR ట్రైలర్ వచ్చింది. మరి R లెటర్ ని మీరు అదృష్టంగా భావిస్తున్నారా?’ అనే ప్రశ్నకు అలియా స్పందించి.. ‘మీ ప్రశ్నకు న దగ్గర సమాధానం లేదు. కానీ R అనేది చాలా బ్యూటిఫుల్ లెటర్. దానితో పాటు A కూడా..’ అంటూ చెప్పి సర్ప్రైజ్ చేసింది. ప్రస్తుతం వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. మీరు ఓ లుక్కేసి మీ అభిప్రాయాలను కామెంట్ చేయండి.