సాధారణంగా అభిమాన సెలబ్రిటీలు ఎప్పుడు, ఎక్కడ ఎదురైనా వారితో ఫోటోలు దిగాలనే ఉత్సాహం మొదలవుతుంది. ఎలాంటి హడావిడి లేకుండా డీసెంట్ గా బిహేవ్ చేస్తే.. సెలబ్రిటీలు కూడా ఫోటోలు, సెల్ఫీలకు సహకరిస్తుంటారు. కానీ.. కొన్నిసార్లు సెలబ్రిటీలు కనిపించగానే కొంతమంది ఫ్యాన్స్ అత్యుత్సాహాన్ని ప్రదర్శిస్తుంటారు. ఒకసారి సెల్ఫీ దిగాక మళ్లీ మళ్లీ అడగడమో.. వాళ్ళు వెళ్ళేదాకా వెంటపడటమో లేదా వారికి దగ్గరగా ఉంటూ టచెస్, హగ్స్ కోసమో ట్రై చేస్తుంటారు. కొంతమంది ఓపిక ఉన్నవారు ఫ్యాన్స్ అని కాదనలేక అడిగిందల్లా చేస్తుంటారు. అదే సెలబ్రిటీలకు చిరాకేస్తే.. వెంటనే సీరియస్ అవ్వడమో.. ఫోన్ తీసి విసిరేయడమో చేస్తారు.
తాజాగా బాలీవుడ్ స్టార్ హీరో రణబీర్ కపూర్ ఓ అభిమాని విషయంలో సహనం కోల్పోయి.. ఆ అభిమాని ఫోన్ ని లాక్కొని విసిరేశాడు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారగా.. నెటిజన్స్, అభిమానులు ఎవరికి తోచిన విధంగా వారు కామెంట్స్ చేస్తున్నారు. వివరాల్లోకి వెళ్తే.. ఇటీవల రణబీర్ కపూర్ ఏదో పబ్లిక్ ప్లేస్ కి వెళ్లినట్లున్నాడు. రణబీర్ క్రేజ్ గురించి తెలిసిందేగా.. ఎదురుపడితే ఫ్యాన్స్ ఎగబడిపోతుంటారు. ఈ క్రమంలో పబ్లిక్ ప్లేస్ లో కనిపించిన రణబీర్ తో సెల్ఫీ దిగేందుకు ఓ అభిమాని మొబైల్ తీసుకొని రెండుమూడు సార్లు ట్రై చేశాడు. రెండుసార్లు నవ్వుతూ రియాక్ట్ అయిన రణబీర్.. ఆ అభిమాని మూడోసారి కూడా సెల్ఫీ దిగేందుకు ట్రై చేయడంతో మొబైల్ లాక్కొని వెనక్కి విసిరేశాడు.
ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట ట్రెండ్ అవుతుండగా.. పలువురు పలు రకాలుగా అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. కానీ.. రెండుసార్లు సెల్ఫీ దిగాక కూడా మళ్లీ మళ్లీ విసిగిస్తే.. ఎవరైనా అంతే రియాక్ట్ అవుతారని రణబీర్ ఫ్యాన్స్ అంటున్నారు. ఇదిలా ఉండగా.. రణబీర్ కపూర్ గతేడాది అలియా భట్ ని పెళ్లాడిన సంగతి తెలిసిందే. వీరికి రీసెంట్ గా కూతురు రాహ జన్మించింది. ఇక రణబీర్, అలియా జంటగా నటించిన బ్రహ్మాస్త్రం మూవీ గతేడాది విడుదలై మంచి విజయాన్ని నమోదు చేసింది. సో.. ఇప్పుడు రణబీర్ ‘తూ ఝూటి మై మక్కర్’ అనే సినిమా చేశాడు. అది మార్చిలో రిలీజ్ కాబోతుంది. అదీగాక సందీప్ రెడ్డి వంగ దర్శకత్వంలో ‘యానిమల్’ సినిమా చేస్తున్నాడు. మరి రణబీర్ అభిమాని మొబైల్ ని విసిరేయడంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ లో తెలియజేయండి.