Rana Daggubati: ప్రముఖ హీరో రానా దగ్గబాటి మంగళవారం సీటీ సివిల్ కోర్టుకు హాజరయ్యారు. ఓ స్థలానికి సంబంధించి కోర్టు ధిక్కరణ కేసులో ఆయన కోర్టుకు వెళ్లారు. ఇంతకీ ఏం జరిగిందంటే.. ప్రముఖ సినీ నటి మాధవి తనకు చెందిన ఫిలింనగర్ కో–ఆపరేటివ్ సొసైటీలోని ఓ ప్లాట్‌ను సినీ నిర్మాత సురేష్ దగ్గుబాటి, వెంకటేశ్‌కు విక్రయించింది. ఆ స్థలంలో 1000 గజాలు సురేష్ దగ్గుబాటి పేరు మీద, 1200 గజాలు హీరో వెంకటేష్ పేరున ఉన్నాయి.
2014లో ఈ స్థలంలోని రెండు ప్లాట్లను ఎమ్మెల్యే కాలనీకి చెందిన నందకుమార్ అనే వ్యాపారికి వారు లీజుకు ఇచ్చారు. నెలకు రూ. 2 లక్షలు చెల్లించే విధంగా ఈ రెండు ప్లాట్లను లీజు అగ్రిమెంట్‌చేయగా 2014లో ఒకసారి, 2016లో మరోసారి లీజు రెన్యూవల్ జరిగింది. సురేష్ 2017లో ఈ ప్లాట్‌ను విక్రయించేందుకు సిద్ధమై లీజు అగ్రిమెంట్‌లో ఉన్న నందకుమార్‌ను సంప్రదించారు.
గజం రూ.1.80 లక్షలు చొప్పున ఈ ప్లాట్ మొత్తానికి రూ. 6 కోట్లు చెల్లించి అగ్రిమెంట్ ఆఫ్‌సేల్ చేసుకున్నట్లు నందకుమార్ తెలిపాడు. అయితే, వేరే వ్యక్తి ఎక్కువ డబ్బులు ఆఫర్ చేయటంతో తన అగ్రిమెంట్‌ను కాదని అతడికి విక్రయించే ప్రయత్నం చేస్తున్నారంటూ నందన్‌కుమార్ కోర్టును ఆశ్రయించాడు. ఈ మేరకు సురేష్‌పై కోర్టులో పిటిషన్ దాఖలైంది.
ఇదిలా ఉండగా సురేష్ ఈ ప్లాట్‌లోని వెయ్యి గజాలను తన కుమారుడు రానా దగ్గుబాటి పేరున రిజిస్ట్రేషన్ చేశాడు. దీంతో రానా దగ్గుబాటికి కోర్టు ధిక్కరణ నోటీసులు జారీ అయ్యాయి. ఈ నేపథ్యంలోనే రానా మంగళవారం కోర్టుకు హాజరయ్యారు. మరి, ఈ ఘటనపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.
ఇవి కూడా చదవండి : Roja Daughter: రోజా కూతురికి చిరు అభినందనలు!