రోజా... రెండు తెలుగు రాష్ట్రాలో పరిచయం అక్కర్లేని పేరు. సినీ నటిగా ఎంతో మంచి గుర్తింపు సంపాందించుకున్నారు. అనంతరం రాజకీయాలోకి ఎంట్రీ ఇచ్చి అనేక ఇబ్బందులు ఎదుర్కొన్ని నిలబడ్డారు. రెండు సార్లు ఎమ్మెల్యేగా గెలిచి.. ప్రస్తుతం మంత్రిగా కొనసాగుతున్నారు. ఇక రోజా కుమార్తె పేరు అన్షు మాలిక. ఈమె రచయిత అన్న సంగతి చాలా మందికి తెలియదు. సినీ పరిశ్రమ వైపు చూడకుండా, అన్షు మాలిక, రచన వైపు మళ్ళింది. ఈ క్రమంలో అనేక అవార్డులు సొంతం చేసుకుంది. అన్షు.. సోషల్ మీడియాలో సైతం ఫుల్ యాక్టీవ్ గా ఉంటుంది. ఎప్పటికప్పుడు తన కుటుంబంతో గడిపిన క్షణాలను అభిమానులతో పంచుకుంటారు. తాజాగా మెగాస్టార్ చిరంజీవితో దిగిన ఫోటోను షేర్ చేస్తూ తన సంతోషాన్ని వ్యక్తం చేసింది. ప్రస్తుతం ఈ ఫోటో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. సాధారణంగా ఇండస్ట్రీలో పనిచేస్తున్న వారు తమ పిల్లలను కూడా ఇండస్ట్రీకి పరిచయం చేయాలని భావిస్తారు కానీ రోజ విషయంలో అందుకు పూర్తిగా భిన్నం అని చెప్పాలి. రోజా, ఆమె భర్త సెల్వమని ఇద్దరు ఇండస్ట్రీకి చెందిన ప్రముఖుల అయినప్పటికీ తన పిల్లలు మాత్రం ఇండస్ట్రీ వైపు ఏ మాత్రం ఆసక్తి చూపలేదు. రోజా కూతురు అన్షు మాలిక అతి చిన్న వయసులోనే వెబ్ డెవలపర్ గా, కంటెంట్ క్రియేటర్ గా, రైటర్ గా, సోషల్ వర్కర్ గా తన ప్రతిభ చూపుతూ ఈతరం పిల్లలకు ఆదర్శంగా నిలుస్తోంది. ఇటీవల రోజా కూతురు అన్షు మాలికకు అరుదైన గౌరవం దక్కిందన సంగతి అందరికి తెలిసిందే. ప్రఖ్యాత ఇన్ఫ్లూఎన్సర్ యూకే మ్యాగజైన్ కవర్ పేజీపై ఆమె ఫొటోను ప్రచురించారు. రచయితగా, ఎంట్రప్రెన్యుయర్ గా, ప్రోగ్రామర్‌గా సమాజం కోసం పాటుపడుతున్నందుకు యంగ్ సూపర్ స్టార్ అవార్డుకు ఎంపికైనట్లు ఇన్ఫ్లూఎన్సర్ సంస్థ ప్రకటించింది. ఇటీవల మంత్రి రోజా కుటుంబం మెగాస్టార్ చిరంజీవి ఇంటికి వెళ్లారు. అక్కడ చిరు దంపతులతో రోజా కుటుంబ సభ్యులు సమావేశం అయ్యారు. ఈ క్రమలో రోజా కూతురుని చిరంజీవి అభినందించారు. ఆయనతో పాటు సతీమణి సురేఖ కూడా రోజా కూతురిని అభినందించారు. ఈక్రమంలో చిరు దంపతులతో అన్షూ ఫోటోలు దిగారు. ఈ ఫోటోలను అన్షు తన ఇన్ స్టాగ్రామ్ అకౌంట్ లో షేర్ చేశారు. "మీతో గడిపిన ప్రతి క్షణం చాలా విలువైనది. మా హృదయంలోనూ బయట మీరు నిజమైన మెగాస్టార్" అంటూ ట్వీట్ చేసింది. ప్రస్తుతం ఈ పోస్ట్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. మరి.. రోజా కూతురు పెట్టిన ఈ పోస్ట్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి. View this post on Instagram A post shared by Anshu (@anshumalikarojaselvamanioffcl) ఇదీ చదవండి: Siri Hanumanth: ఖరీదైన కారు కొన్న బిగ్ బ్యాస్ బ్యూటీ సిరి.. ముందు డ్రైవింగ్ నేర్చుకో అన్న ప్రియుడు! ఇదీ చదవండి: Video: ప్రెగ్నెంట్ అని చెప్పా! రెజీనా ఊహించని కామెంట్స!