ఎనర్జిటిక్ హీరో రామ్ పోతినేని హీరోగా తమిళ స్టార్ డైరెక్టర్ లింగుస్వామి దర్శకత్వంలో ఒక సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలో కృతీ శెట్టి, అక్షర గౌడ హీరోయిన్లుగా చేస్తున్నారు. తాజాగా ఈ సినిమా టైటిల్‌ను రివీల్ చేశారు మేకర్స్. రొమాంటిక్ యాక్షన్ థ్రిల్లర్‌గా తెరకెక్కుతున్న ఈ చిత్రానికి ‘ది వారియర్’ అనే టైటిల్‌ను ఖరారు చేశారు. దీనికి సంబంధించిన పోస్టర్‌ను సోషల్ మీడియా వేదికగా రిలీజ్ చేశారు.
#RAPO19 is #𝐓𝐇𝐄𝐖𝐀𝐑𝐑𝐈𝐎𝐑𝐑 🔥#RAPO19FirstLook pic.twitter.com/dedw7G3SBD
— RAm POthineni (@ramsayz) January 17, 2022
టైటిల్‌తోపాటు రామ్ పోతినేని ఫస్ట్ లుక్‌ను విడుదల చేసింది చిత్ర యూనిట్. రొమాంటిక్ యాక్షన్ థ్రిల్లర్‌గా రూపొందుతున్న ఈ సినిమాలో రామ్ పోలీసు అధికారిగా కనిపించనున్నట్లు తెలుస్తోంది. తెలుగు, తమిళ భాషల్లో ఎంతో ప్రతిష్టాత్మకంగా రూపొందుతోన్న ఈ మూవీపై భారీ అంచనాలే ఉన్నాయి. ఇక, ఈ సినిమాకు ‘ద వారియర్’ అనే పేరును ఖరారు చేసినట్లు వెల్లడించారు. ఇందులో యంగ్ హీరో ఆది పినిశెట్టి విలన్‌గా నటిస్తున్నట్లు చిత్ర యూనిట్ ఇటీవలే ప్రకటించింది. అలాగే, సీనియర్ నటి నదియా కూడా ఇందులో కీలక పాత్రను చేస్తున్నారు. ఈ సినిమాను శ్రీనివాస సిల్వర్ స్క్రీన్ బ్యానర్‌పై శ్రీనివాస చిట్టూరి భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్నారు. దీనికి దేవీ శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నాడు. దీన్ని ఈ ఏడాది సమ్మర్‌లో విడుదల చేస్తారని వార్తలు వస్తున్నాయి.