రామ్ గోపాల్ వర్మ.. ఎప్పుడు వివాదాల్లో ఉంటూ తన సినిమాల శైలే వేరంటూ తెలియజేస్తుంటాడు. నేడు ఆయన పుట్టిన రోజు కావడంతో పలువురు ప్రముఖులు ఆయనకు పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. ఈ సందర్బంగా ఆయనకు జన్మదిన శుభాకాంక్షలు చెబుతూ సినీ గేయ రచయిత సిరా శ్రీ ఓ ట్వీట్ చేశారు.
ఇది కూడా చదవండి: బర్త్‌డే రోజు ఆర్జీవీకి షాకు.. కోట్లలో మోసం.. కోర్టు నోటీసులు..
This is another verse about you @RGVzoomin sirjee!! 😍
సైకిల్ చైనుతొ సినిమా
సైకీనే మార్చివేసి చరితాత్ముండై
జైకొట్టిన ఛీకొట్టిన
రాకెట్టుగ దూసుకెళ్లు రాముండితడే-సిరాశ్రీ
— Sira Sri (@sirasri) April 7, 2022
ఆర్జీవి సర్ నీ గురించి ఓ పద్యం రాస్తున్నాను, “సైకిల్ చైన్ తో సినిమా.. సైకీనే మార్చివేసి చరితాత్ముండై ..జై కొట్టిన చీ కొట్టిన.. రాకెట్టుగా దూసుకెళ్లు రాముండితడే” అని సిరాశ్రీ ట్విట్టర్ లో రాసుకొచ్చారు. దీనిపై రాంగోపాల్ వర్మ తనదైన శైలిలో స్పందిస్తూ.. బాగానే ఉంది కానీ నన్ను రాముడితో కంటే రావణుడితో పోలిస్తే నే నాకు మరింత సంతృప్తిగా ఉంటుందని పేర్కొన్నారు. ఈ ట్వీట్ పై నెటిజన్లు అర్జీవి శైలిలో నే ఆసక్తికర రిప్లై లు ఇస్తున్నారు. వర్మ రిప్లేపై మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి.
All well but I will be more comfortable in comparison with Ravana https://t.co/KgwFVxjlbF
— Ram Gopal Varma (@RGVzoomin) April 7, 2022
మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం SumanTV App డౌన్లోడ్ చేసుకోండి.