హాలీవుడ్ క్రిటిక్స్ అసోషియేషన్ పురస్కారాల్లో ఏకంగా ఐదు అవార్డులను తన ఖాతాలో వేసుకుంది ఆర్ఆర్ఆర్. అదీకాక బెస్ట్ యాక్షన్ మూవీస్ లో బెస్ట్ యాక్టర్స్ గా క్రిటిక్స్ ఛాయిస్ సూపర్ అవార్డ్స్ లో నామినేట్ అయ్యారు రామ్ చరణ్, జూ. ఎన్టీఆర్. ఈ సందర్భంగా యంగ్ టైగర్ పై ఉన్న తన ప్రేమను మరోసారి చాటుకున్నాడు రామ్ చరణ్. దాంతో రామ్ చరణ్ సంస్కారానికి ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఫిదా అవుతున్నారు.
హాలీవుడ్ సినిమా ఇండస్ట్రీ గోడలు బద్దలు కొడుతూ.. ప్రపంచ వ్యాప్తంగా అవార్డుల పంట పండిస్తోంది RRR.టాలీవుడ్ దర్శక ధీరుడు ఎస్ఎస్. రాజమౌళి ఎంతో ప్రతిష్టాత్మకంగా ఈ చిత్రాన్ని తెరకెక్కించాడు. యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ లు ఇద్దరు ఈ సినిమాలో తమ నట విశ్వరూపాన్ని చూపించారు. దాంతో అవార్డులు దాసోహం అవుతున్నాయి. ఇప్పటికే ఎన్నో అంతర్జాతీయ పురస్కారాలు సొంతం చేసుకున్న ఆర్ఆర్ఆర్.. తాజాగా మరోసారి అవార్డుల పంట పండించింది. హాలీవుడ్ క్రిటిక్స్ అసోషియేషన్ పురస్కారాల్లో ఏకంగా ఐదు అవార్డులను తన ఖాతాలో వేసుకుంది ఆర్ఆర్ఆర్. అదీకాక బెస్ట్ యాక్షన్ మూవీస్ లో బెస్ట్ యాక్టర్స్ గా క్రిటిక్స్ ఛాయిస్ సూపర్ అవార్డ్స్ లో నామినేట్ అయ్యారు రామ్ చరణ్, జూ. ఎన్టీఆర్. ఈ సందర్భంగా యంగ్ టైగర్ పై ఉన్న తన ప్రేమను మరోసారి చాటుకున్నాడు రామ్ చరణ్. దాంతో రామ్ చరణ్ సంస్కారానికి ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఫిదా అవుతున్నారు.
ఆర్ఆర్ఆర్.. ఇప్పటికే ఈ పేరు ప్రపంచ వ్యాప్తంగా మారుమ్రోగిపోయింది. తాజాగా హాలీవుడ్ క్రిటిక్స్ పురస్కారాల్లో ఐదు అవార్డులు సాధించి మరోసారి తెలుగు సినిమా సత్తా ఏంటో నిరూపించింది. అదీకాక క్రిటిక్స్ ఛాయిస్ సూపర్ అవార్డ్స్ లో యాక్షన్ మూవీ కేటగిరీలో బెస్ట్ యాక్టర్స్ గా నామినేట్ అయ్యారు రామ్ చరణ్, ఎన్టీఆర్ లు. దాంతో మరో అవార్డు రావడం ఖాయం అని తెలుగు ప్రేక్షకులు అనుకుంటున్నారు. ఈ క్రమంలోనే యంగ్ టైగర్ పై తనకున్న ప్రేమను మరోసారి చాటుకున్నాడు రామ్ చరణ్. ఇండస్ట్రీలో ఎన్టీఆర్, రామ్ చరణ్ లు ఎంత మంచి స్నేహితులో మనందరికి తెలిసిందే.
ఇక ఆర్ఆర్ఆర్ సినిమాతో ఆ బంధం మరింతగా బలపడింది. ఇక క్రిటిక్స్ సూపర్ ఛాయిస్ అవార్డులకు ఇద్దరు నామినేట్ కావడంతో తన సంతోషాన్ని, యంగ్ టైగర్ పై ఉన్న ప్రేమను ట్వీటర్ ద్వారా పంచుకున్నాడు రామ్ చరణ్. ట్వీటర్ వేదికగా..”బెస్ట్ యాక్షన్ మూవీస్ లో బెస్ట్ యాక్టర్స్ గా నా అన్న ఎన్టీఆర్ పేరుతో పాటుగా నా పేరును చూసుకోవడం చాలా సంతోషంగా ఉంది. అదీకాక మా పేర్లు హాలీవుడ్ దిగ్గజాలు అయిన నికోలస్ కేజ్, టామ్ క్రూజ్, బ్రాడ్ పిట్ లతో కలిసి ఉండటం గోప్ప సంతోషాన్ని ఇస్తోంది” అని రామ్ చరణ్ రాసుకొచ్చారు.
ఇక ఈ ట్వీట్ ద్వారా తన సంస్కారాన్ని మరోసారి చాటుకున్నాడు రామ్ చరణ్. తమ మధ్య ఎలాంటి స్నేహం ఉందో చాటి చెప్పాడు రామ్ చరణ్. ఇక ఈ ట్వీట్ చూసిన ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఫిదా అవుతున్నారు. ఇది కదా అసలైన స్నేహం అంటే! అని సోషల్ మీడియా వేదికగా తమ సంతోషాన్ని పంచుకుంటున్నారు. హాలీవుడ్లో విశేషంగా భావించే ‘హాలీవుడ్ క్రిటిక్స్ అసోసియేషన్’ పురస్కారాల్లో ‘బెస్ట్ స్టంట్స్’, ‘బెస్ట్ యాక్షన్ మూవీ’, ‘బెస్ట్ ఒరిజినల్ సాంగ్’ (నాటు నాటు), ‘బెస్ట్ ఇంటర్నేషనల్ ఫిల్మ్’ ఇలా పలు విభాగాల్లో ప్రముఖ చిత్రాలను వెనక్కి నెట్టింది ‘ఆర్ఆర్ఆర్’. మరి రామ్ చరణ్, ఎన్టీఆర్ ల స్నేహంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.
Delighted to see my brother @tarak9999 ‘s and my name on the nominees list of Best Actor in an Action Movie.
What a beautiful feeling to see our names next to legends like Nicolas Cage, Tom Cruise and Brad Pitt! https://t.co/FVVPx1lm9i— Ram Charan (@AlwaysRamCharan) February 25, 2023