హాలీవుడ్ క్రిటిక్స్ అసోషియేషన్ పురస్కారాల్లో ఏకంగా ఐదు అవార్డులను తన ఖాతాలో వేసుకుంది ఆర్ఆర్ఆర్. అదీకాక బెస్ట్ యాక్షన్ మూవీస్ లో బెస్ట్ యాక్టర్స్ గా క్రిటిక్స్ ఛాయిస్ సూపర్ అవార్డ్స్ లో నామినేట్ అయ్యారు రామ్ చరణ్, జూ. ఎన్టీఆర్. ఈ సందర్భంగా యంగ్ టైగర్ పై ఉన్న తన ప్రేమను మరోసారి చాటుకున్నాడు రామ్ చరణ్. దాంతో రామ్ చరణ్ సంస్కారానికి ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఫిదా అవుతున్నారు.