ఆర్ఆర్ఆర్ మూవీ తెచ్చిన క్రేజ్ తో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్.. గ్లోబల్ స్టార్ అయిపోయాడు. ప్రస్తుతం ఆస్కార్ వేడుకల కోసం అమెరికాలోని లాస్ ఏంజిల్స్ లో రామ్ చరణ్ సందడి చేస్తున్నాడు. స్పెషల్ మూమెంట్స్ లో ఫ్యాన్స్ ని కలిసేందుకు ఎప్పుడూ ఆసక్తి చూపించే చరణ్.. లాస్ ఏంజిల్స్ లో తన అభిమానులను కలుసుకున్నాడు. అమెరికాలో తన ఫ్యాన్స్ చూపిస్తున్న ప్రేమాభిమానాలను చరణ్ ఫిదా అయిపోయాడు
ఆర్ఆర్ఆర్ మూవీ తెచ్చిన క్రేజ్ తో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్.. గ్లోబల్ స్టార్ అయిపోయాడు. ప్రస్తుతం ఆస్కార్ వేడుకల కోసం అమెరికాలోని లాస్ ఏంజిల్స్ లో రామ్ చరణ్ సందడి చేస్తున్నాడు. స్పెషల్ మూమెంట్స్ లో ఫ్యాన్స్ ని కలిసేందుకు ఎప్పుడూ ఆసక్తి చూపించే చరణ్.. లాస్ ఏంజిల్స్ లో తన అభిమానులను కలుసుకున్నాడు. అమెరికాలో తన ఫ్యాన్స్ చూపిస్తున్న ప్రేమాభిమానాలను చరణ్ ఫిదా అయిపోయాడు. అమెరికాలోని ఫ్యాన్స్ ఈ నెల 11న లాస్ ఏంజిల్స్ లో ‘మీట్ గ్రీట్’ అనే ప్రోగ్రామ్ అరేంజ్ చేశారు. లాస్ ఫెలిజ్ బ్లెవ్డ్ వేదికగా జరిగిన ఈ మీట్ అండ్ గ్రీట్ ఈవెంట్ లో రామ్ చరణ్ పాల్గొన్నాడు.
అమెరికా అయినప్పటికీ.. మన కల్చర్ ని రిప్రెజెంట్ చేస్తూ.. పండితుల వేదమంత్రోచ్చారణ నడుమ పూర్ణకుంభంతో మెగా ఫ్యాన్స్ చరణ్ కి ఘన స్వాగతం పలికారు. అమెరికాలో కూడా మన నేటివిటీ సంప్రదాయాలతో ఫ్యాన్స్ రిసీవ్ చేసుకున్న తీరు, ప్రేమాభిమానాలు అక్కడి వాతావరణంలో పాజిటివ్ వైబ్రేషన్స్ క్రియేట్ చేశాయి. ఇదే ఈవెంట్ లో ఫ్యాన్స్ చరణ్ తో మాట్లాడే అవకాశాన్ని అందిపుచ్చుకుని, ఫోటోలు కూడా దిగారు. ఈ సందర్భంగా ఫ్యాన్స్ ఆదరాభిమానాలు చూసి ఎమోషనల్ అయిన రామ్ చరణ్.. ఫ్యాన్స్ ని ప్రశంసిస్తూ గొప్పగా మాట్లాడాడు. రామ్ చరణ్ ని దగ్గరగా చూసి.. కలిసే అవకాశం రావడంతో మెగా ఫ్యాన్స్ ఆనందానికి హద్దే లేకుండా పోయింది.
ఇక రామ్ చరణ్ మాట్లాడుతూ.. “ఇండియాలో ఒక ఏరియా నుండి ఇంకో ఏరియాకి వెళ్లడం కాస్త ఈజీనే. కానీ.. అమెరికాలో ఎంత కష్టమో నాకు తెలుసు. నా మీదున్న అభిమానంతో ఎక్కడెక్కడి నుండో చాలా దూరం ప్రయాణం చేసి ఇక్కిడికి వచ్చిన ఫ్యాన్స్ అందరికీ కృతజ్ఞతలు చెప్పడం చాలా చిన్న విషయం. మీరు చూపించే అభిమానాన్ని ఎప్పటికీ గుండెల్లో పెట్టుకుంటాను. ఇంతగా అభిమానించే ఫ్యాన్స్ ని కలిసినప్పుడు మాలో ఉత్సాహం రెట్టింపు అవుతుంది. ఈ వేదికపై ఇంతమంది ఫ్యాన్స్ ని కలవడం ఎంతో ఆనందంగా ఉంది. మీ ప్రేమాభిమానాల గురించి ఎంత చెప్పినా తక్కువే. ఈ అభిమానం చూస్తే సినిమాల్లో ఇంకా గొప్ప సినిమాలు చేసి మిమ్మల్ని మెప్పించాలనే కసి పెరుగుతోంది. మీ వల్లే నేను ఈ స్టేజ్‌లో ఉన్నాను. ఈ ట్రిప్‌ను ఎప్పటికీ మరచిపోలేను. ‘ఆర్‌ఆర్‌ఆర్’ సినిమా వాడిగా కాదు.. తెలుగువాడిగా, భారతీయుడిగా మనమంత ఓ చరిత్ర సృష్టించబోతున్నాం. ఈ హిస్టరీలో మీరంతా కూడా భాగమే!” అని చెప్పుకొచ్చాడు.
#RamCharan Entry at the Meet and Greet event in Los Angeles ❤️#GlobalStarRamCharan pic.twitter.com/qoNvFTIOIp
— Navya (@HoneYNavya_) March 12, 2023
GLOBAL STAR RAM CHARAN PARTICIPATES IN MEET-AND-GREET WITH FANS IN LOS ANGELES pic.twitter.com/E1olaI2p7r
— Hardin (@hardintessa143) March 12, 2023