సెలబ్రిటీలు సోషల్ మీడియాలో యాక్టీవ్ గా ఉండలేకపోవచ్చు. కానీ.. ఎప్పుడో ఓసారి కనిపించినా.. ఆ రచ్చ వేరేలా ఉంటుంది. తాజాగా మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ అదే ప్రూవ్ చేశారు.
సెలబ్రిటీలు ఎప్పుడు సోషల్ మీడియాలో ఎప్పుడు యాక్టీవ్ గా కనిపించినా ఫ్యాన్స్ లో కనిపించే ఉత్సాహం వేరుగా ఉంటుంది. ఫ్యాన్స్ కోరుకున్నట్లే.. సెలబ్రిటీలు కూడా దాదాపు అన్ని వేళలా ఫ్యాన్స్ ని ఎంటర్టైన్ చేసేందుకు రెడీగా ఉంటారు. కాకపోతే ఫ్యామిలీ, సినిమా షూటింగ్స్.. ఇలా డిఫరెంట్ రీసన్స్ వలన వారు సోషల్ మీడియాలో యాక్టీవ్ గా ఉండలేకపోవచ్చు. కానీ.. ఎప్పుడో ఓసారి కనిపించినా.. ఆ రచ్చ వేరేలా ఉంటుంది. తాజాగా మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ అదే ప్రూవ్ చేశారు. రామ్ చరణ్.. ప్రముఖ బాలీవుడ్ డాన్స్ కొరియోగ్రాఫర్ గణేష్ ఆచార్యతో కలిసి కొత్తగా ట్రెండ్ అవుతున్న ఓల్డ్ రీమిక్స్ సాంగ్ కి మాస్ స్టెప్స్ వేసి రచ్చ చేశాడు.
బాలీవుడ్ 90స్ సాంగ్స్ అంటే.. ఆ మ్యాజిక్ ఎలా ఉంటుందో తెలిసిందేగా. ఈ నెలలో అక్షయ్ కుమార్, ఇమ్రాన్ హష్మీ, మృణాల్ ఠాకూర్ మెయిన్ రోల్స్ లో ‘సెల్ఫీ’ అనే సినిమా రిలీజ్ కాబోతుంది. ఈ సినిమా కోసం ఓల్డ్ ‘మై కిలాడీ తూ అనారి’ మూవీలోని టైటిల్ సాంగ్ ని రీమిక్స్ చేశారు. ఉదిత్ నారాయణ్ పాడిన ఆ పాట.. ఎంతో హుషారుగా సాగుతుంది. పైగా ఒరిజినల్ మూవీలో కూడా హీరో అక్షయ్ కుమారే కావడం విశేషం. అయితే.. ఇప్పుడీ ట్రెండింగ్ సాంగ్ కి కొరియోగ్రాఫర్ గణేష్ ఆచార్యతో కలిసి రామ్ చరణ్ చిందేయడం మనం చూడవచ్చు. 90స్ కిడ్స్ అందరికీ ఈ సాంగ్ చాలా ఫేవరేట్. ప్రస్తుతం కిలాడీ అక్షయ్ పాటకు చరణ్ డాన్స్ నెట్టింట వైరల్ గా మారింది. మరి రామ్ చరణ్ మాస్ డాన్స్ గురించి మీ అభిప్రాయాలు కామెంట్స్ లో తెలపండి.