రామ్ చరణ్-ఉపాసన దంపతులు పండంటి ఆడబిడ్డకు జన్మనిచ్చారు. ఈ బేబీకి ఒక సెంటిమెంట్ కలిసి వస్తోందని అభిమానులు చర్చించుకుంటున్నారు. బుజ్జి పాపాయి విషయంలో ఒక నంబర్ వర్కౌట్ అయిందని అంటున్నారు.
మెగాస్టార్ నట వారసుడు రామ్ చరణ్ తండ్రి అయ్యారు. చెర్రీ-ఉపాసన దంపతులు పండంటి ఆడబిడ్డకు జన్మనిచ్చారు. ఈ విషయాన్ని మెగా ఫ్యామిలీ అధికారికంగా ప్రకటించింది. ఇటీవలే వీళ్లిద్దరి 11వ వివాహ వార్షికోత్సవం జరిగింది. ఇంతలోనే మెగా ఇంట్లోకి కొత్త వ్యక్తి అడుగుపెట్టడంతో అందరిలోనూ ఆనందం వెల్లివిరుస్తోంది. చెర్రీ-ఉప్సీలకు పుట్టిన మెగా ప్రిన్సెస్‌కు ఒక సెంటిమెంట్ కలిసొచ్చిందని అభిమానులు చెప్పుకుంటున్నారు. చరణ్-ఉపాసన దంపతులకు ఆడబిడ్డ 20వ తేదీన జన్మించింది. న్యూమరాలజీ ప్రకారం బేబీకి రెండో నంబర్ వస్తోంది. చరణ్ తండ్రి చిరంజీవి జన్మతేదీ ఆగస్టు 22. ఈ రకంగా 2 నంబర్ సెంటిమెంట్ ఒకటి వర్కౌట్ అయిందని ఫ్యాన్స్ అంటున్నారు. పవర్ స్టార్ పవన్ కల్యాణ్ జన్మతేదీ సెప్టెంబర్ 2.
ఈ రకంగా చరణ్ వారసురాలికి మెగాస్టార్, పవర్ స్టార్ పుట్టిన రోజు నంబర్ వర్కౌట్ అయిందని అభిమానులు సోషల్ మీడియాలో చర్చించుకుంటున్నారు. ఏదేమైనా చిరు కుటుంబంలో దాదాపు పదకొండేళ్ల తర్వాత ఒక వారసురాలు రావడంతో ఆ ఫ్యామిలీలో ఆనందం వెల్లివిరుస్తోంది. ఇకపోతే, కొన్నేళ్ల ప్రేమ తర్వాత రామ్ చరణ్-ఉపాసనలు పెళ్లి బంధంతో ఒక్కటైన సంగతి తెలిసిందే. వీరి ప్రేమకు పెద్దలు సమ్మతి తెలపడంతో గ్రాండ్‌గా మ్యారేజ్ చేసుకున్నారు. ఇటీవలే వీళ్లు 11వ వివాహ వార్షికోత్సవాన్ని సెలబ్రేట్ చేసుకున్నారు. కాగా, 2023 మెగా కుటుంబానికి చాలా స్పెషల్ ఇయర్‌గా నిలిచింది. రామ్ చరణ్, జూనియర్ ఎన్టీఆర్ కలసి నటించిన ‘ఆర్ఆర్ఆర్’ సినిమాలోని ‘నాటు నాటు’ పాటకు ఈ ఏడాది ఆస్కార్ అవార్డు రావడం విశేషం. ఇప్పుడు వారసురాలు పుట్టడంతో మెగా ఫ్యాన్స్ ఆనందానికి హద్దే లేకుండా పోతోంది.